Home వార్తలు అదృష్టముంటే పవన్‌తో సినిమా చేస్తా

అదృష్టముంటే పవన్‌తో సినిమా చేస్తా

dil-rajuసాయిధరమ్ తేజ్, రాశీఖన్నా హీరో హీరోయిన్‌లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మించిన చిత్రం ‘సుప్రీమ్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో సక్కెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు దిల్‌రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “అనిల్ రావిపూడి కథ చెప్పినప్పుడు ‘సుప్రీమ్’ పెద్ద కమర్షియల్ ఎంటర్‌టైనర్ అవుతుందని నమ్మి ఈ సినిమా చేశాను. సాయిధరమ్‌తో మూడు సినిమాలు చేశాను. మూడింటిలో తన పనిని అద్భుతంగా చేసుకుంటూ పోయాడు. ఈ సినిమాలో కూడా దర్శకుడు అనిల్ రావిపూడి, నన్ను అతను ఫాలో అయ్యాడంతే. సినిమాలో హీరో… పిల్లాడిని కలుస్తాడు. ఆ పిల్లాడికి ఉన్న సమస్యేంటో తెలుస్తుంది. దాని కోసం హీరో ఏం చేశాడనేదే ఈ సినిమా. ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం చిత్రాలు తర్వాత నేను కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ఒకటి రెండు మినహా స్టార్ హీరోలతో చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు నేను మారుతితో కలిసి ఓ సినిమా, బెక్కం వేణుగోపాల్‌తో కలిసి మరో సినిమా చేయబోతున్నాను. ఇలాంటి సినిమాల కోసం ఓ కొత్త బ్యానర్‌ను ప్రారంభించి నా సమర్పణలో, నా బ్యానర్‌లో శిరీష్, హర్షిత్‌లను నిర్మాతలుగా పెట్టి సినిమాలు చేస్తాను. ఆ కొత్త బ్యానర్‌ను త్వరలోనే తెలియజేస్తాను. నా బ్యానర్‌లో ‘జనగణమన’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేశాను. పూరీ జగన్నాథ్ నాకు ఫోన్ చేసి తనకు ఆ టైటిల్ కావాలనడంతో అతనికిచ్చేశాను. పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయలను కున్నాను. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్తే సినిమాలు చేయనం టున్నారు. మరి ఆయనతో సినిమా చేసే అదృష్ట ముంటే తప్పకుండా చేస్తాను. అలాగే చిరంజీవితో సినిమా చేస్తానా, లేదా అని చెప్పలేను.