Friday, March 29, 2024

‘సాయ్’ ట్రయల్స్‌కు ఇప్పుడే వెళ్లను

- Advertisement -
- Advertisement -

Srinivas Gowda

 

కొంత సమయం కావాలన్న కంబళ
హీరో శ్రీనివాస గౌడ

న్యూఢిల్లీ: స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిర్వహించే ట్రయల్స్‌లో పాల్గొనడానికి సంప్రదాయ క్రీడ ‘ కంబళ’ పోటీదారుడు శ్రీనివాస గౌడ నిరాకరించాడు. సాయ్ నిర్వహించే ట్రయల్స్‌లో ఇప్పుడే పాల్గొననని, దాని కొంత సమయం కావాలని ఆయన బెంగళూరులో చెప్పాడు.‘ సాయ్ నిర్వహించే ట్రయల్స్‌లో నేను పాల్గొనను. కంబళలో మరిన్ని ఘనతలు సాధించాలని అనుకుంటున్నా. ప్రస్తుతం కంబళ టోర్నమెంటు జరుగుతోంది. అందుకే ఒక నెల సమయం కావాలని సాయ్‌ని కోరాలని అనుకుంటున్నా. అయితే కంబళ, అథ్లెట్స్ పాల్గొనే ట్రాక్స్ వేర్వేరుగా ఉంటాయి. ట్రాక్స్‌లో వేళ్లమీద పరుగెడితే కంబళలో మడమల మీద పరుగెడతాం. ఒకదానిలో రాణించిన వారు మరో దానిలో అంతగా సత్తా చాటలేరు. ట్రాక్స్ ఈవెంట్స్‌లో రాణించిన అనేక మంది సంప్రదాయ క్రీడల్లో విజయవంతం కాలేకపోయారు’ అని చెప్పాడు.

కర్నాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో నిర్వహించే కంబళ పోటీల్లో పాల్గొన్నశ్రీనివాస్ గౌడ జమైకా వీరుడు ఉసేన్ బోల్ట్‌ను తలదన్నేలా వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్ల్లలో పూర్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడిని ఉసేన్ బోల్ట్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎంపి శశి థరూర్, మహింద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహింద్రా లాంటి వారు కూడా గౌడకు తగిన విక్షణ ఇచ్చి అంతర్జాతీయ అథ్లెట్‌గా తయారు చేయాలని సాయ్‌కి సూచించారు. ఇది చూసిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరెన్ రిజిజు పౌతం అతడ్ని సాయ్ ట్రయల్స్‌కు ఆహ్వానించారు. అయితే శ్రీనివాస గౌడ సాయ్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి నిరాకరించాడని సాయ్ వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రిని కలవడానికి గౌడ బెంగళూరు వెళ్లాడు. ఆయనతో మాట్లాడడానికి బెంగళూరు సాయ్‌కి చెందిన అధికారుల బృందంముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లింది. అయితే అతను ఆసక్తి చూపించలేదు. అతను గా యంతో బాధపడుతున్నట్లు మాకు తెలిసింది’ అని సాయ్ వర్గాలు తెలిపాయి.ఇదిలా ఉం డగా కర్నాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప సోమవారం శ్రీనివాస గౌడను తన కార్యాలయానికి పిలిపించి శాలువాతో సత్కరించి రూ.3 లక్షల నగదు బహుమతిని అందజేశారు.

I will not participate in Sports Authority of India trials
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News