Home జాతీయ వార్తలు జర్మనీ నుంచి ఖాళీ ఆక్సిజన్ కంటైనర్లను తీసుకొచ్చిన ఐఎఎఫ్

జర్మనీ నుంచి ఖాళీ ఆక్సిజన్ కంటైనర్లను తీసుకొచ్చిన ఐఎఎఫ్

IAF brings empty oxygen containers from Germany

 

న్యూఢిల్లీ : జర్మనీ లోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీ లోని హిండాన్ విమానాశ్రయానికి నాలుగు ఖాళీ క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లను ఇండియన్ ఎయిర్ పోర్స్ ఆదివారం తీసుకొచ్చింది. ఇదే విధంగా సి17 విమానం ద్వారా బ్రిటన్ లోని బ్రిజ్‌నార్టన్ నుంచి తమిళనాడు లోని చైన్నై విమానాశ్రయానికి 450 ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొచ్చినట్టు ఐఎఎఫ్ ప్రకటించింది. ఆదివారం దేశం లోనే ఒకచోట నుంచి మరో చోటికి అనేక విమానాల ద్వారా ఆక్సిజన్ కంటైనర్లను తరలించినట్టు వివరించింది. దేశం లోని వివిధ కొవిడ్ ఆస్పత్రులకు కావలసిన ఔషధాలు, ఇతర సామగ్రి ఐఎఎఫ్ చేరవేస్తున్నట్టు పేర్కొంది.