Home జాతీయ వార్తలు ఐఎఎస్ తండ్రిపై చర్య తీసుకోనున్న ఐఎఎస్ కుమార్తె!

ఐఎఎస్ తండ్రిపై చర్య తీసుకోనున్న ఐఎఎస్ కుమార్తె!

చండీగఢ్: ఉద్యోగ విరమణ చేసినా ప్రభుత్వ గృహాన్ని ఖాళీ చేయని తండ్రి చేత స్వయంగా ఆయన ఐఎఎస్ కుమార్తె ఇంటి నుంచి బయటకు తరమాల్సిన వింత పరిస్థితి చండీగఢ్‌లో ఏర్పడింది. కేంద్ర పాలిత చండీగఢ్‌లో సబ్ డివిజన్ మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న నాజూక్ కుమార్ అనే ఐఎఎస్ అధికారికి ఈ అనివార్య పరిస్థితి ఏర్పడింది. సెక్టార్ 16లోని క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న చండీగఢ్ మాజీ హోం కార్యదర్శి అనిల్ కుమార్ జూన్‌లో పదవీ విరమణ చేశారు. నాజూక్ కుమార్ సెక్టార్ 7లో నివసిస్తున్నప్పటికీ అనిల్ కుమార్ నివాసం ఉంటున్న ఇంటి గోడపై ఆమె నేమ్ ప్లేట్ కూడా ఉండడం విశేషం. కాగా, తండ్రి ఖాళీ చేస్తే ఆ ఇంటిని క్వార్టర్స్‌గా ఉపయోగించుకోవలాంటూ నాజూక్‌ను హౌస్ అలాట్‌మెంట్ కమిటీ కార్యదర్శి నవంబర్ 20న ఒక లేఖలో ఆదేశించారు. జూన్ 30న రిటైర్‌మెంట్ అయినందున అక్టోబర్ 31లోగా ప్రభుత్వ క్వార్టర్స్‌ను ఖాళీ చేయాలంటూ అనిల్ కుమార్‌ను ఆ లేఖలో ఆదేశించారు. గడువు తీరినప్పటికీ అనిల్ కుమార్ ఆ ఇంటిని ఖాళీ చేయకుండా అందులోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేయించే బాధ్యత నాజూక్ కుమార్‌పై పడింది. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటానని ఆమె మీడియాకు చెప్పారు.

 

IAS daughter to take action on her father, UT SDM Nazuk Kumar has been tasked with eviting her father from the government accomodation