Home జాతీయ వార్తలు హోం క్వారంటైన్‌ను ఉల్లంఘించి.. యుపి వెళ్లిపోయిన ఐఎఎస్

హోం క్వారంటైన్‌ను ఉల్లంఘించి.. యుపి వెళ్లిపోయిన ఐఎఎస్

IAS-officer

తిరువనంతపురం: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కఠినంగా అమలవుతున్న వేళ ఓ యువ ఐఎఎస్ అధికారి బాధ్యతా రహితంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డారు. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్‌పై పౌరులకు అవగాహన కల్పించాల్సిన ఆయనే స్వయంగా నిబంధనలను ఉల్లఘించి వార్తల్లోకి ఎక్కారు. హోం క్వారంటైన్‌ను ఉల్లంఘించి స్వస్థలానికి పయనమైనారు. దీంతో ఇప్పుడు సదరు అధికారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుపమ్ మిశ్రా కేరళలోని కొల్లాంలో సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల సెలవుపై విదేశాల్లో పర్యటించిన ఆయన ఈనెల 18న భారత్‌కు తిరిగి వచ్చారు.

అదే రోజు ఆయన విధు ల్లో చేరారు కూడా. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్న నేపథ్యంలో ఆయనను అధికారిక నివాసానికే పరిమితం కావాలిందిగా కొల్లాం జిల్లా కలెక్టర్ అబ్దుల్ నజీర్ ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం మిశ్రా నివాసానికి వెళ్లిన పని మనుషులకు ఆయన ఎక్కడా కనిపించలేదు. దీంతో వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై కలెక్టర్ నజీర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘ అనుపమ్ మిశ్రా తన స్వస్థలమైన యుపిలోని కాన్పూర్ వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం విచారణ జరుపుతున్పాం, మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇక్కడినుంచి వెళ్లిపోయారు. ఇది విచారించదగ్గ విషయం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా’ అని చెప్పా రు. ఇది చాలా బాధ్యతారాహిత్యం. అతను కొల్లాంలో లేరు’ అని కేరళ మత్స శాఖ మంత్రి జె మెర్సీకుట్టి అన్నారు. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

IAS officer booked in Kerala for violating quarantine