Home తాజా వార్తలు ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ కన్నుమూత

ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ కన్నుమూత

Ibrahimpatnam Former MLA Narasimha passed away

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ముస్సు నర్సింహ్మ(52) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఐదు రోజుల క్రితం చికిత్స నిమిత్తం నిమ్స్ లో చేరారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న నర్సింహ్మ సోమవారం ఉదయం తనువుచాలించారు. 2004లో సిపిఎం పార్టీ నుంచి ఎంఎల్ఎగా పోటీ చేసి గెలిచారు. 2004 నుంచి 2009 వరకు ఎంఎల్ఎగా కొనసాగారు. మాజీ ఎంఎల్ఎ మృతిపట్ల సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 1994లో జరిగిన ఎంపిటిసిగా చింతుల్ల ఎన్నికల్లో సిపిఎం పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. 2000 సంవత్సరంలో జరిగిన జడ్పీటిసి ఎన్నికలో యాచారం మండలం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ముస్సు నర్సింహ్మ ప్రస్తుతం వ్యవసాయ కార్మిక సంఘలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు.

Ibrahimpatnam Former MLA Narasimha passed away