Friday, April 19, 2024

ఐసిసి సిఇఓగా జియోఫ్ అల్లార్డిస్

- Advertisement -
- Advertisement -
Geoff Allardice
జులైలో రాజీనామా చేసిన మను సాహ్ని స్థానంలో అల్లార్డిస్

దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) శాశ్వత సిఇఓగా ఆస్ట్రేలియాకు చెందిన జియోఫ్ అల్లార్డిస్‌ను ఐసిసి గవర్నింగ్ బాడీ నియమించింది. తాత్కాలికంగా (ఇంటరీమ్ బేసిస్)లో పాత్ర పోషించిన ఆయనను పర్మనెంట్ సిఇఓగా నియమిస్తున్నట్లు ఐసిసి గవర్నింగ్ బాడీ ఆదివారం తెలిపింది. ఆ తర్వాత “నన్ను ఐసిసి సిఇఓగా నియమించినందుకుగ్రేగ్(బర్‌క్లే)కు, ఐసిసి బోర్డ్‌కు కృతజ్ఞుణ్ని. ఈ స్పోర్ట్(క్రికెట్)ను లీడ్ చేయడానికి నాకో కొత్త అవకాశం లభించింది. దీని కొత్త దశ అద్భుతంగా ఉండగలదు. నేను ఈ ఆటకు సరైనదే చేస్తాను. నేను ఐసిసి సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని తన ప్రకటనలో అల్లార్డిస్ పేర్కొన్నాడు.

అల్లార్డిస్ ఆస్ట్రేలియాకు చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్, అడ్మినిస్ట్రేటర్, ఇదివరలో ఐసిసి జనరల్ మేనేజర్‌గా ఎనిమిదేళ్లు పనిచేశారు. ‘ఐసిసి సిఇఓగా ఉండడానికి జియోఫ్ ఒప్పుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది” అని ఐసిసి చైర్మన్ గ్రెగ్ బర్‌క్లే తెలిపారు. సాహ్నీ తన సహోద్యోగులతో ‘అనుచితంగా ప్రవర్తించినందుకు’ అతడిని మార్చిలో సెలవుపై పంపించేశారు. ఆయనపై విచారణ పెండింగ్‌లో ఉండింది. అతను చివరికి జులైలో తన పదవికి రాజీనామా చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News