Thursday, April 18, 2024

టీమిండియాకు జరిమానా

- Advertisement -
- Advertisement -

దుబాయి: కివీస్‌తో జరిగిన ఐదు టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌కు షాక్ తగిలింది. చివరి టి20లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగాఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. ‘ ఐసిసి ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. లేని పక్షంలో ఒక ఓవర్‌కు 20 శాతం చొప్పున జట్టు ఆటగాళ్లు, ఆ జట్టు సిబ్బంది మ్యాచ్ ఫీజులో కోత తప్పదు. టీమిండియా చివరి మ్యాచ్‌లో ఒక ఓవర్ ఆలస్యంగా మ్యాచ్ ముగించింది. ఫీల్డ్ అంపైర్లు క్రిస్ బ్రౌన్, షాన్ హేగ్, థర్డ్ అంపైర్ ఆష్లే మెహ్రోత్రాల ఫిర్యాదు మేరకు టీమిండియాకు జరిమానా తప్పలేదు’ అని మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ICC Fined to India for slow over rate against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News