Home తాజా వార్తలు టి20 వరల్డ్‌కప్ థీమ్ సాంగ్ విడుదల

టి20 వరల్డ్‌కప్ థీమ్ సాంగ్ విడుదల

ICC released the anthem song for T20 World Cup

 

దుబాయి: పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన థీమ్ సాంగ్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) విడుదల చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ వరల్డ్‌కప్ జరుగనున్న విషయం తెలిసిందే. లివ్ ద గేమ్.. లవ్ ద గేమ్ థీమ్‌తో ప్రపంచంలోని నలుదిక్కుల అభిమానులు క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నట్టు ఐసిసి వీడియోను రూపొందించింది. అమిత్ త్రివేది ఈ వీడియోను కంపోజ్ చేశాడు. ఇందులో వరల్డ్‌కప్‌లో పాల్గొనే జట్ల జెర్సీలను, జాతీయ జెండాలను చూపించారు. ఈ వీడియోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, విండీస్ సారథి పొలార్డ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్, అఫ్గానిస్థాన్ సంచలనం రషీద్ తదితరులు అవతార్ యానిమేషన్ క్యారెక్టర్లతో గ్రౌండ్‌లోకి దూకుతూ కనిపిస్తారు. ఈ సాంగ్‌లో వరల్డ్‌కప్ కోసం ఒకరికొకరు పోటీ పడుతున్నట్టు చూపించారు.

T20 World Cup anthem released by ICC