దుబాయి: బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో భారత్ సాధించిన అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన భారత ఆటగాళ్లు మహమ్మద్ షమీ, మయాంక్ అగర్వాల్‌లు తమ కెరీర్లోనే అత్యుత్తమ టెస్టు ర్యాంకింగ్‌లను అందుకున్నారు. బంగ్లా బౌలర్లపై విరుచుకు పడుతూ డబుల్ సెంచరీ (243 పరుగులు) సాధించిన అగర్వాల్ 691 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. అతడి కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం గమనార్హం. అతడు ఆడిన ఎనిమిది టెస్టుల్లోనే అసాధారణ ప్రతిభతో చెలరేగుతూ ఏకంగా 851 పరుగులు సాధించాడు.
అతనితో పాటుగా బంగ్లాదేశ్‌పై ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన షమీకూడా కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించాడు. షమీ బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తూ తొలి ఇన్నింగ్స్‌లో మూడు (3/27), రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు (4/31) పడగొట్టాడు. దీంతో 790 రేటింగ్ పాయింట్లు సాధించి బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన మూడో బౌలర్‌గా షమీ నిలిచాడు. అతడికంటే ముందు కపిల్ దేవ్ (877), జస్ప్రీత్ బుమ్రా (832) ఉన్నారు. కాగా టీమిండియా సీనియర్ స్పిన్నర్వ్రిచంద్రన్ అశ్విన్ (10) టాప్10లో చోటు దక్కించుకున్నాడు.
కాగా ఇశాంత్ శర్మ 20, ఉమేశ్ యాదవ్ 22 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక బ్యాటింగ్ టాప్10 ర్యాంకింగ్స్‌లో కోహ్లీ(2),చెతేశ్వర్ పుజారా(4),అజింక్య రహానే(5), రోహిత్ శర్మ(10) ఉన్నారు. ఇక అల్రౌండర్ విభాగంలో అజయ్ జడేజా417 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా బంగ్లా బ్యాట్మ్న్లో ముష్ఫికర్ రెహ్మాన్(30),లిటస్ దాస్(86) తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టు కోల్‌కతా వేదికగా నవంబర్ 22నుంచి (శుక్రవారం) ప్రారంభం కానుంది.
ICC Test Rankings Mohammed Shami Mayank