న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2023-25 ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) కోసం భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది. మూడవ WTC సీజన్ వచ్చే నెలలో లార్డ్స్‌లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ముగుస్తుంది. ICC మొత్తం 5.76 మిలియన్ల(రూ. 49.32 కోట్లు) ప్రైజ్ మనీని గురువారం ప్రకటించింది. WTC ఫైనల్ లో గెలిచిన జట్టుకు రూ. 30.78 కోట్ల భారీ ప్రైజ్ మనీని అందుకోనుంది. ఇక, రన్నరప్ రూ. 18.46 కోట్లు అందుకుంటుంది.
గతంలో కంటే ఈ సారి ప్రైజ్ మనీని భారీగా పెంచింది ఐసిసి. టెస్టు క్రికెట్ ప్రాముఖ్యతను పెంచే ఉద్దేశంతో ఈసారి ప్రైజ్ మనీ పెంచినట్లు ఐసిసి వెల్లడించింది. కాగా, గత 2 సీజన్ లో టీమిండియా ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసింది. తొలి సీజన్ లో న్యూజిలాండ్, రెండో సీజన్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.ఇక, మూడో సీజన్ లో మాత్రం మూడోస్థానంలో నిలిచి ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.