Thursday, April 25, 2024

చరిత్ర సృష్టించే సత్తా ఉంది

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై జరిగే మహిళల ట్వంటీ20 ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర సృష్టించడం ఖాయమని జట్టు ప్రధాన కోచ్ డబ్లూవి.రామన్ జోస్యం చెప్పాడు. కొంతకాలంగా భారత్ ఆట ఎంతో మెరుగైందన్నాడు. ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా ప్రస్తుత జట్టుకు ఉందన్నాడు. ఇటీవలే ముగిసిన టి20 ట్రై సిరీస్‌లో భారత్ ప్రదర్శనే దీనికి నిదర్శనమన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి అగ్రశ్రేణి జట్లను భారత్ ఓడించిన విషయాన్ని రామన్ గుర్తు చేశాడు. 1983లో కపిల్‌దేవ్ సేన ప్రపంచకప్ నెగ్గి ఎలాగయితే చరిత్ర సృష్టించిందో ఈసారి మహిళా జట్టు కూడా అలాంటి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఎంతో బలంగా ఉందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు జట్టులో కొదవలేదన్నాడు. ఇతర జట్లకు గట్టి పోటీ ఇచ్చే సత్తా ప్రస్తుత భారత జట్టుకు ఉందన్నాడు. స్మృతి మంధాన, రోడ్రిగ్స్, రిచా, హర్మన్‌ప్రీత్, దీప్తి తదితరులతో భారత్ చాలా బలంగా ఉందని, ట్రోఫీని సాధించే సత్తా ప్రస్తుత జట్టుకు ఉందనే ధీహాను రామన్ వ్యక్తం చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారత్ కూడా ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగుతుందన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, విండీస్, కివీస్, సౌతాఫ్రికా వంటి పెద్ద జట్లను ఓడించే సత్తా భారత్‌కు ఉందన్నాడు. దీంతో ఈసారి హర్మన్‌ప్రీత్ సేన ప్రపంచకప్‌తో చరిత్ర సృష్టించినా ఆశ్చర్యం లేదని రామన్ పేర్కొన్నాడు.

ICC Women’s t20 World Cup 2020 Start from Feb 21

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News