Home తాజా వార్తలు కొత్త సంవత్సరం నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త రుసుములు

కొత్త సంవత్సరం నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త రుసుములు

ICICI Bank service charge on saving accounts

 

ముంబయి : ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెపింది. కొత్త ఏడాది 2022 జనవరి 1నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్‌పై సర్వీస్ చార్జీలను సవరించనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఎటిఎం నగదు లావాదేవీల్లోను మార్పులు చేసింది. కొత్త సంవత్సరంనుంచి వర్తించే మార్పులు ఇలా ఉన్నాయి. ఖాతాదారులు ఎటిఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.ఆ తర్వాత ప్రతి లావాదేవీపైనారూ.20ను ఎటిఎం చార్జీగా వసూలు చేస్తారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారులు ఇతర బ్యాంక్‌ల ఎటిఎంలలో మెట్రో నగరాల్లో నెలకు మూడు సార్లు, ఇతర పట్టణాల్లో ఐదు సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు.(ఇందులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు కూడా భాగమై ఉంటాయి) ఇంటర్‌చేంజ్ ఫీజు పెంచుకునేందుకు ఆర్‌బిఐ ఆమోదించిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలపై ఫీజులు పెరిగాయి.

ICICI Bank service charge on saving accounts