Home జాతీయ వార్తలు జాదవ్‌కు కాన్సులర్ సాయం

జాదవ్‌కు కాన్సులర్ సాయం

Kulbhushan Jadhav

 

ఐసిజె దెబ్బకు దిగొచ్చిన పాకిస్థాన్

ఇస్లామాబాద్ : చెరలో ఉన్న భారతీయ నౌకాధికారి కులభూషణ్ జాదవ్‌కు కాన్సులర్ సాయానికి అవకాశం కల్పిస్తున్నట్లు పాకిస్ధాన్ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన వెలువరించింది. అయితే పాకిస్థాన్ చట్టాల మేరకు భారతీయ దౌత్యాధికారులు ఆయనను కలిసేందుకు వీలు కల్పిస్తామని ఈ ప్రకటనలో తెలిపారు. జాదవ్ మరణశిక్షను ఇటీవలే అంతర్జాతీయ న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ఆయనకు విధించిన శిక్షపై సమీక్షించుకోవాలని కూడా పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కాన్సులర్ సంబంధాల వియన్నా ఒప్పందం పరిధిలో జాదవ్‌కు ఈ సౌకర్యం కల్పిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చుకుంది. చెరలో ఉన్న జాదవ్‌కు సైనిక న్యాయస్థానంలో విచారణ దశలో సరైన న్యాయ సాయం, భారతీయ దౌత్యాధికారులు కలుసుకునే వీలు కల్పించకపోవడంపై ఐసిజె అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామంతో పాకిస్థాన్ దిగివచ్చింది. తమది బాధ్యతాయత దేశం అని, పాకిస్థాన్ చట్టం మేరకు కమాండర్ కుల్‌భూషణ్ జాదవ్‌ను కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ICJ Orders Pakistan To Grant Consular Access To Jadhav