Tuesday, March 21, 2023

సూర్యాపేటను జిల్లా కేంద్రంగా గుర్తించండి

- Advertisement -

pet

* జిల్లా ఏర్పడినా పాత బోర్డులే దర్శనం

మన తెలంగాణ/సూర్యాపేట ః సూర్యాపే ట జిల్లా ఏర్పడి దాదాపు 18 నెలలు కా వస్తున్నా వివిధ మండలాలలో ప్రభుత్వ కార్యాలయ బోర్డులపై పాత జిల్లా పేర్లే ఉన్నాయని, వెంటనే సూర్యాపేట జిల్లాగా బోర్డులు మార్చాలని లోక్‌సత్తా పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లెటి రమేష్‌కుమార్ డిమాండ్ చేశారు. పెన్‌పహాడ్ మండ లంలో ఎంపిడిఓ, ఎస్‌ఈఆర్‌పి కార్యాల యాల బోర్డులు, గ్రామ పంచాయితీ కా ర్యాలయాల బోర్డులు నల్లగొండ జిల్లా పేరుతో పాత బోర్డులే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో జరిగే అభివృద్ధి పనులు అన్ని సూర్యాపేట జిల్లా పేరు మీద జరుగుతున్నాయన్నారు. కానీ అధికారుల పనితీరులో మార్పురావడం లేద న్నారు. కేవలం నాలుగు అక్షరాల పేరు మార్చడంలో నిర్లక్షంగా ఉంటే, ప్రభు త్వ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారో అర్ధం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News