Home తాజా వార్తలు అందరూ కలిసి కృషి చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి: గవర్నర్

అందరూ కలిసి కృషి చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి: గవర్నర్

governorమెదక్: ప్రజా ప్రతినిధులతో గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. సిద్దిపేట్ నియోజక వర్గంలో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలతో గవర్నర్ సమావేశమయ్యారు. అందరూ కలిసి కృషి చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాజకీయాల అతీతంగా అందరూ కృషి చేయాలన్నారు. చెట్లను నాటడం కాదు చెట్లను రక్షించాలన్నారు. గత సంవత్సరం నాటిన చెట్ల వివరాలను సర్పంచుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ అంటే గ్రామ ప్రజల సహాకారంతో గ్రామాలన్ని పచ్చని గ్రామాలుగా తయారుచేయాలన్నారు. గోదావరి జలాలతో మెదక్ జిల్లా సస్యశ్యామలమవుతోందన్నారు. ఈ సమావేశంలో అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే తెలుగు భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.