Home తాజా వార్తలు బిల్లు బాగుంటే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవట్లేదు

బిల్లు బాగుంటే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవట్లేదు

If it's watershed moment, why farmers not celebrating

 

కేంద్రం వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలి : మంత్రి కెటిఆర్ ట్వీట్
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు ఎన్‌డిఎ పక్షాలు రాజీనామా చేస్తున్నాయి

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లు బాగుంటే దేశప్రజలంతా ఎందుకు సంబరాలు చేసుకోవడంలేదని రాష్ట్ర మంత్రి, టిఆర్‌స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. దేశప్రజలంతా ఈ బిల్లుతో ఆందోళన బాట పట్టారనే విషయం కేంద్రానికి తెలుసాని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లుపై మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లు బాగాలేకపోవంతోనే కేంద్రానికి మద్దతు ఇస్తున్న ఎన్‌డిఎ కూటమి పక్కకు వెళ్లుతుందనే కనీస పరిజ్ఞానం కేంద్రానికి లేదన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టన వ్యవసాయ బిల్లు చారిత్రాత్మకమైతే దేశంలోని ప్రజలు సంబరాలకు బదులు ఆందోళన బాట ఎందుకు పట్టారని కెటిఆర్ కేంద్రాన్ని నిలదీశారు. భూవివాదాలు పరిష్కరిస్తూ, రైతుల సమస్యలను తీరుస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టగానే తెలంగాణ ప్రజలు సిఎం కెసిఆర్‌కు క్షీరాభిషేకం చేశారని ఆయన గుర్తు చేశారు. బిల్లుప్రజలు ఆమోదించే విధంగా ప్రజాసంక్షేమంకోసం ఉండాలే కానీ ఎవరినో ఉద్దరించేందుకు ఉండకూడన్నారు. టిఆర్‌ఎస్ ఎంపిలు పార్లమెంట్‌లో బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు విపక్షాలకు మద్దుతు ఇస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

If it’s watershed moment, why farmers not celebrating