Home జాతీయ వార్తలు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు బ్రేకులు…!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు బ్రేకులు…!

Bullet train projectముంబై: మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి అధికారాన్ని చేపడితే ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక బుల్లెట్ ట్రైన్‌కు బ్రేకులు పడే అవకాశం ఉంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్-ముంబై మధ్య ఈ బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలన్నది ప్రధాని మోడీ లక్షం. అయితే, తమ కూటమి ప్రభుత్వం ఏర్పడితే భారతదేశంలో నిర్మించ తలపెట్టిన మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును రద్దు చేసి, ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 1 లక్ష కోట్లను నిలిపివేయాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ, జపాను ప్రధాని షింజో అబె 2017 సెప్టెంబర్‌లో అహ్మదాబాద్‌లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 0.1 శాతం వడ్డీపై జపాను రూ. 88,000 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం రుణంగా అందచేస్తోంది. ఈ ప్రాజెక్టును కొనసాగించదలిస్తే కేంద్ర ప్రభుత్వమే ఖర్చంతా భరించాలని, ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ఒక్క పైసా పెట్టబోదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకడు ఒకరు స్పష్టం చేశారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడితే రైతుల సంక్షేమ పథకాలు, రైతులకు రుణ మాఫీ అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

If Sena-NCP-Cong take over brakes on Bullet train project
the new government is likely to shelve the Bullet train project