Home తాజా వార్తలు నిజాం కళాశాలలో ఇఫ్తార్‌ విందు

నిజాం కళాశాలలో ఇఫ్తార్‌ విందు

CM-KCR-Iftarహైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసింది. నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు హాజరయ్యారు.