Home తాజా వార్తలు బెదిరింపులపై పోలీసులకు ఇళయరాజ ఫిర్యాదు

బెదిరింపులపై పోలీసులకు ఇళయరాజ ఫిర్యాదు

Ilayaraja Complaint On Saiprasad To POliceచెన్నయ్ :  ఎల్.వి.ప్ర‌సాద్ స్టూడియోస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎల్‌.వి.ప్ర‌సాద్ మనవడు సాయిప్రసాద్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళయరాజపై గౌర‌వంతో స్టూడియోలో ఓ ప్ర‌త్యేక‌మైన గ‌దిని ఎల్.వి.ప్రసాద్ కానుక‌గా ఇచ్చారు. ఈ రికార్డింగ్ స్టూడియోలో ఇళ‌య‌రాజా నాలుగు ద‌శాబ్దాలుగా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హి‌స్తున్నారు. అయితే ఎల్‌.వి.ప్ర‌సాద్ కొడుకు ర‌మేశ్ ప్ర‌సాద్ స్టూడియోలో ఇళయరాజ పనికి ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. ఎల్‌.వి.ప్ర‌సాద్ మన‌వ‌డు సాయిప్ర‌సాద్ మాత్రం స్టూడియో స్వాధీనం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో సాయిప్రసాద్, ఇళయరాజ మధ్య వివాదం నెలకొంది. స్టూడియో నుంచి త‌న‌ను ఖాళీ చేయాలని సాయిప్రసాద్ బెదిరిస్తున్నారని ఇళ‌య‌రాజా సాయి ప్ర‌సాద్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సాయి ప్రసాద్ తన స్టూడియోను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, అతని నుంచి రక్షణ కలిపించి తనకు న్యాయం చేయాలని ఇళయరాజ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.