Home తాజా వార్తలు ‘పిల్లల కోసం ఆయనతో టచ్ లో ఉంటాను’

‘పిల్లల కోసం ఆయనతో టచ్ లో ఉంటాను’

renu

 ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన రెండో పెళ్లికి సంబంధించిన ఎంగేజ్ మెంట్ ను  ‘ట్విట్టర్’ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో తన ట్విట్టర్ ఖాతాను రేణూ దేశాయ్ ఇటీవలే డీయాక్టివేట్ చేసుకుంది. అయితే ఆమెని ఎంతగానో అభిమానించే అభిమానులు మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో రేణూతో టచ్ లో ఉంటూనే ఉన్నారు.  ఈ నేపథ్యంలో ఓ అభిమాని, పెళ్లి తర్వాత కూడా మీరు పవన్ తో టచ్ లో ఉంటారా అని ప్రశ్నించగా.. ‘తప్పకుండా ఉంటాను. ఎందుకంటే, అకీరా, ఆద్య అనే ఇధ్దరు పిల్లలకు ఆయన తండ్రి. పిల్లల భవిష్యత్ కోసం ఆయనతో టచ్ లో ఉండాల్సిందే. పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు లేదా ఏవైనా వేడుకలు, వచ్చినప్పుడు అకీరా, ఆద్యాలు ఆయన దగ్గరకు వెళతారు’ అని రేణూ చెప్పుకొచ్చింది. రేణూ మాటలతో అభిమానులలో ఉన్న పలు అనుమానాలు తొలగిపోయినట్టు అయింది.