Home తాజా వార్తలు అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా పట్టివేత…

అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా పట్టివేత…

Gutka

 

నిర్మల్ : పట్టణంలోని నారాయణరెడ్డి మార్కెట్ ప్రాంతంలో సమాచారం మేరకు నిల్వ ఉంచిన 15 రకాల గుట్కా స్వాధీనం చేసుకొని, గుట్కా వ్యాపారంతో సంబంధం ఉన్న హీరా పాన్‌షాప్ యజమాని పింజారి గుట్టకు చెందిన షేక్ షఫీర్‌ అహ్మద్‌ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ శశిధర్‌రాజు మాట్లాడుతూ… నిర్మల్ జిల్లాలో గుట్కా అమ్మకాలను పూర్తిగా నిషేదించేందుకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే గత రెండు రోజుల క్రితం దాదాపు రూ. 1లక్ష 25వేల విలువ చేసే నిషేదిత గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐ జాన్‌దివాకర్, ఎస్‌బి ఇన్స్‌క్టర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Illegal Gutka bags were seized