Home తాజా వార్తలు మున్సిపల్ ఆస్తులు అక్రమ రిజిస్ట్రేషన్‌పై ఆగ్రహం

మున్సిపల్ ఆస్తులు అక్రమ రిజిస్ట్రేషన్‌పై ఆగ్రహం

కమిషనర్‌పై కౌన్సిలర్ల గరం 

సరెండర్ చేయాలని డిమాండ్
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తీర్మానం
వాడీవేడిగా సాగిన సమావేశం

Registration_manatelanganaనల్లగొండ టౌన్ : మున్సిపల్ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, మున్సిపల్ ఆస్తులను స్వాధీనం చేసుకొని పట్టణ అభివృద్ధి కోసం పాటుపడాలని చైర్‌పర్సన్‌ను కోరారు. అవినీతిపై చర్యలు తీసుకోవాలని కొంత మంది కౌన్సిలర్లు పొడియం వద్ద కూర్చొని నిరస నలు తెలిపారు. గత 25 రోజులుగా సమ్మె చేపడుతున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప జేయాలని ఏకగ్రీవంగా తీర్మాణం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. ఈ సందర్భంగా ఎంఐఎం కౌన్సిలర్ ఖలీల్ మాట్లాడుతూ, కొంత మంది అక్రమదారులు మున్సిపల్ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకొని రుణాలు పొందారని, వారిపై ఇంత వరకూ ఏలాంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే విచారణ జరిపించి మున్సిపల్ ఆస్తులను కాపాడాలన్నారు. పట్టణంలోని మున్సిపల్ ఆస్తులన్నింటికి నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌లు ఇచ్చిన కమిషనర్‌ను సరెండర్ చేసి, అందుకు సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్, బిజెపి,
కౌన్సిలర్లు కూడా కమిషనర్‌ను వెంటనే సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం కౌన్సిలర్ ఎండి సలీం, కాంగ్రెస్ కౌన్సిలర్ దుబ్బ ఆశోక్ సుందర్‌లు మాట్లాడుతూ, తెలంగాణలో నల్లగొండ మున్సిపాల్టీకి ఎంతో పేరుందని, కొంత మంది అధికా రుల తప్పిదం, రాజకీయ పక్షాల ద్వారా మున్సిపల్‌లో అవినీతి జరిగిందని, దీనిపై కమిషనర్‌ని నిందించడం సరైంది కాదని, కమిషనర్‌ను సరెండర్ చేసే విషయాన్ని ఆలోచన చేసుకొని విర మించుకోవాలన్నారు. పట్టణ అభివృద్ధికై కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇకముందు ఇలాంటి అక్ర మాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మెజార్టీ కౌన్సిలర్లు సరెండర్ చేయాలని కోరడంతో మున్సిపల్ చైర్‌పర్సన్ కలుగజేసుకొని సభ్యులందరి తీర్మానం మేరకు నిర్ణయం తీసు కొని సరెండర్ విషయంపై ఆలోచిస్తామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అలువేలు మంగతాయారు మాట్లాడుతూ, అవినీతి జరిగింది వాస్తవమేనని, కొన్ని ఒత్తిళ్ళ ద్వారా సంత కాలు చేయడం జరిగిందని, సంతకాలు చేసిన సర్టిఫికెట్‌లను రద్దుపరుస్తామన్నారు. గతంలో జరిగిన అవినీతిపై జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణ అభివృద్ధికై కౌన్సిల్‌సభ్యుల సమన్వయంతో, సిఎండి ఆదేశాల మేరకు పనిచే స్తానన్నారు. పట్టణంలోని పలు కాలనీలలో ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిస్తున్నాయని, ముఖ్యంగా చెత్త తరలి ంచే విష యంలో ట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో చెత్త పేరుకు పోతుందని, దీనికి తోడు పారిశుద్ధ కార్మికుల కొరత ఏర్పడిం దని కౌన్సిలర్లు పేర్కొన్నారు. పట్టణ సమస్యలపై మున్సిపల్ సిబ్బ ంది ఎప్పడికప్పుడు పర్యవేక్షించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి మున్సిపల్ సమావే శంలో అన్ని శాఖల అధికారులు తప్పని సరిగా హాజరై కౌన్సిలర్లు లేవనె త్తిన ప్రజాసమస్యలపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికై కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్‌రెడ్డి, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, దుబ్బ ఆశోక్ సుందర్, అవుట రాజేందర్, మిర్యాల యాదగిరి, నూకల వెంకట రమ ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.