Home తాజా వార్తలు కలుషిత ఆహారంతో విద్యార్ధుల అస్వస్థత

కలుషిత ఆహారంతో విద్యార్ధుల అస్వస్థత

students

 

దౌల్తాబాద్ : కలుషిత ఆహారం తిని పలువురు విధ్యార్థ్ధులు అస్వస్థతకు గురైన సంఘటన శనివారం మండల పరిధిలోని బాలంపేట కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్ధ్థినులకు ఉదయం అల్పాహారంగా ఆటుకులు అందించినట్లు విద్యార్థ్ధులు పేర్కొంటున్నారు. అల్పాహారాన్ని సేవించిన కాసేపటికే దాదాపు 15మంది విద్యార్ధ్థినులు కడుపు నొప్పితో తీవ్ర ఆస్వస్థతకు గురైనారు. గమనించిన సిబ్బంది విద్యార్థ్ధులను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రిలో వైద్యులెవరు అందుబాటులో లేక పోవడంతో తీవ్ర కడుపు నొప్పితో బాదపడుతున్న ముగ్గురు విద్యార్ధ్థులను చికిత్స నిమ్మితం కొడంగల్‌కు తరలించారు. అయితే బాలంపేట కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్ధ్థులు అస్వస్థతకు గురికావడం నెల రోజుల వ్యవద్ధ్దిలో ఇది రెండవ సారి కావడం గమనార్హం. పాఠశాలలో నాణ్యమైన బోజనం అందించాల్సిన సిబ్బంది నిర్లక్షం వల్లనే విద్యార్ధ్థులు ఆస్వస్థతకు గురౌతున్నట్లు విద్యార్థ్ధి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విధ్యార్ధ్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష దోరణితో వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తిసుకోవాలని డిమాండ్ చేశారు. నెలలో ఇలాంటి సంఘటనలు రెండవ సారి కావండంతో విద్యార్థ్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Illness for students who eated contaminated food