Home Default అస్వస్థతకు గురైన నరసింహన్

అస్వస్థతకు గురైన నరసింహన్

Narasimhanపాట్నా : తెలంగాణ గవర్నర్ నరసింహన్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బిహార్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం నరసింహన్ వాంతులు చేసుకున్నారు. తక్షణమే ఆయన్ను గయలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం భేష్షుగ్గా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నరసింహన్ తన సతీమణితో కలిసి ఢిల్లీకి బయల్దేరారు.

Illness To Telangana Governor Narasimhan