Home తాజా వార్తలు రానాకు అనారోగ్యం…?

రానాకు అనారోగ్యం…?

Actor Ranaహైదరాబాద్ : ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం కారణంగానే రానా బక్క చిక్కిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై రానా స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తేల్చి చెప్పారు. ‘హాథీ మేరే సాథీ’ సినిమా కోసమే సన్నబడాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అడవిలో 30 ఏళ్లు ఉండిపోయిన వ్యక్తి పాత్రలో తాను నటిస్తున్నానని, ఈ క్రమంలో  ఈ పాత్ర కోసం తాను సన్నాబడాలని దర్శకుడు చెబితే , సన్నబడ్డానని ఆయన చెప్పారు.  ఈ సినిమా షూటింగు పూర్తైన వెంటనే మళ్లీ బరువు పెరుగుతానని రానా పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై రానా స్పష్టత ఇవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రానా ’విరాటపర్వం‘ సినిమాలో నటిస్తున్నారు.

Illness To Tollywood Actor Rana Daggubati