Home Default నటుడు సత్యనారాయణకు అస్వస్థత

నటుడు సత్యనారాయణకు అస్వస్థత

Illness To Tollywood Actor Satyanarayanaహైదరాబాద్ :  ప్రముఖ టాలీవుడ్ నటుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. నాలుగు రోజుల క్రితం ఆయన తన ఇంట్లో జారిపడ్డారు. ఈ క్రమంలో శనివారం రాత్రి సత్యనారాయణ అనారోగ్యానికి గురికావడంతో సికిందరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యనారాయణ ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వృద్ధాప్యం కారణంగా  కైకాల ప్రస్తుతం సినిమాల్లో నటించడం తగ్గించారు. ఈ  క్రమంలో ఆయన ఇంటికే పరిమితయ్యారు. చివరగా ఆయన  ‘యన్టీఆర్ కథానాయకుడు, మహర్షి’ సనిమాల్లో నటించారు. ఆయన త్వరితగతి కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.