Thursday, April 25, 2024

కెప్టెన్సీకి సిద్ధం: కమిన్స్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధమేనని స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ స్పష్టం చేశాడు. జట్టు యాజమాన్యం కోరితే పగ్గాలు స్వీకరిస్తానని పేర్కొన్నాడు. అయితే తనకు కెప్టెన్సీ విషయంలో ఏ మాత్రం అనుభవం లేదన్నాడు. ఈ పరిస్థితుల్లో సారధిగా ఎంత వరకు సఫలం అవుతానో ముందే ఊహించడం కష్టమేనన్నాడు. అయితే లభిస్తే మాత్రం దానికి సాధ్యమైనంత వరకు న్యాయం చేస్తాననే నమ్మకం ఉందన్నాడు. ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలుకావడంతో టిమ్ పైన్‌ను కెప్టెన్సీ తప్పించాలనే డిమాండ్ ఊపందుకుంది. పైన్ స్థానంలో కమిన్స్‌కు కెప్టెన్సీ అప్పగించాలని ఆస్ట్రేలియాకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు.

I’m Ready to Captaincy says Pat Cummins

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News