Home తాజా వార్తలు పురుషులకు ప్రవేశం లేదు!

పురుషులకు ప్రవేశం లేదు!

Ima Keithel

 

శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత ఎక్కడ ఉంటుందీ అని ఎవరైనా అడిగితే ప్రతి స్త్రీలో ఉంటుందని గట్టిగా జవాబు చెప్పొచ్చు. ఎలా రుజువు చేయి అంటారు… సరేపోయి తిన్నగా మణిపూర్ రాజధాని ఇంఫాల్ వెళ్లి ఇమాకేధిల్ ఎక్కడుందీ అని అడిగితే తెలుస్తుం. మణిపూర్ భాషలో ఇమా అంటే అమ్మ… కేధిల్ అంటే బజారు అని అర్థం. అక్కడ 400౦ మందికి పైగా మహిళా వ్యాపారస్తులు కనిపిస్తారు. ఐదువందల సంవత్సరాలుగా ఆడవారే వ్యాపారులుగా కొనసాగుతున్న వ్యాపార సామ్రాజ్యం ఇది. పురుషులకు అక్కడ ప్రవేశం లేదు. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే మదర్స్ మార్కెట్ ఇది.

 

ఇది మహిళలను ప్రోత్సహించేందుకు మణిపూర్ ప్రభుత్వం ఏర్పాటు చేసి బహుమతిగా ఇచ్చింది కాదు. జీవన సమాహారంలో అవసరంపడి ఏర్పాటైన సహజసిద్ధమైన మార్కెట్ ఇది. మణిపూర్ మహిళలు వందల ఏళ్లుగా ఒకే చోట చేరి చేసుకుంటున్న వ్యాపార కూడలి. 1786లో బ్రిటిషర్ల గెజిట్‌లో ఇంఫాల్ మధ్య లోంచి ప్రవహించే నదీ తీరంలో ఆడవారే వ్యాపారస్తులుగా సాగే లావాదేవీల గురించిన వితరణ ఉంది ఆంగ్లేయుల నుంచి తమ సరుకులు రక్షించుకునేందుకు ఈ మార్కెట్‌లో మహిళలు తుపాకులు పట్టుకుని పోరాటం చేశారట. నూపిలాన్ పేరుతో ఈ పోరాటం గురించి చరిత్రలో ఒక పేజీ భద్రంగా ఉంది. ఈ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న మహిళలకు జ్ఞాపకంగా ఇంఫాల్‌లో ఒక మ్యూజియం ఉంది. 500 ఏళ్ల క్రితం కథ ఇది.

16వ శతాబ్దంలో జీవనోపాధి కోసం పురుషులంతా దూర ప్రాంతాలకు వెళ్లటం, యుద్ధాల్లో పాల్గొనవలసి రావటంతో ఆడవాళ్లు వ్యవసాయ పనులు, కుటుంబ పోషణ కోసం బొమ్మలు చేయటం, బుట్టలు అల్లటం, ఆభరణాలు రూపొందించటం, బట్టలు కుట్టటం వంటి తమకు చేతనైన పనులతో, తయారైన వస్తువుతో ఒక చోట కూర్చొని అమ్మేవాళ్లు. అలా ఇమాకేధిల్ రూపు దిద్దుకుంది. ఇక వందల ఏళ్ల క్రితం చెప్పాలా? వ్యాపారం వృద్ధి చెందటం గమనించాక ్రస్త్రీలను అక్కడ నుంచి తరిమేందుకు బ్రిటీషర్లు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఈ చోటునీ, తమ వ్యాపారాన్ని వదిలేందుకు స్త్రీలు ఒప్పుకోలేదు. అది జీవన్మరణ సమస్య. తమ వ్యాపారం లాక్కునేందుకు ఏ మగవాళ్లనీ,చివరకు బ్రిటీష్ వాళ్లని కూడా అంగుళం లోపలికి రానివ్వలేదు. ఆడవాళ్లు ఇప్పటికీ ఇదే సామరస్య భావన, పోరాట పటిమ కొనసాగిస్తున్నారు. వీళ్లందరికీ ఒక జీవన దర్పణం ఈ మార్కెట్.

మహిళలే నిర్వహించే మార్కెట్లలో ఇమాకేధిల్ అతి పెద్దది. దీని ప్రత్యేకత గమనించాక అక్కడి ప్రభుత్వం వ్యాపారాలని, పక్కా భవనాలను నిర్మించి ఇచ్చింది. నెలకు 40 రూపాయల అద్దెతో మహిళలు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. 16వ శతాబ్దంలో ఏర్పాటైనట్లుగా తెలుస్తున్న ఈ మార్కెట్‌లో పెళ్లయిన మహిళలే వ్యాపారం నిర్వహించేందుకు అర్హులు. సంప్రదాయబద్ధమైన సాదారంగు చీరలు పైన శాలువా వేసుకుని మహిళలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు. ఒక్క మహిళ సంవత్సరానికి రెండు లక్షల వరకూ సంపాదిస్తుంది. మణిపూర్ సంప్రదాయ ఉత్పత్తులు, చేతి ఉత్పత్తులు ఎక్కువగా లభిస్తాయి. శుచి శుభ్రత, నాణ్యత ప్రత్యేకతలు. ఇమా కేధిల్ గొప్ప పర్యాటక ప్రదేశం కూడా.

అందమైన పూసల వస్తువులు, లక్కతో చేసే అందమైన నగిషీ పని ఉన్న ప్రకృతి చిత్రాలు, దాండియాలు ఆడే కర్రలు, అలంకరణ సామగ్రి పెట్టెలు, రంగురంగుల గుడ్డల కుట్టు పనులు, గోడపైన వేలాడదీసే భాటియాలు, నూఫ్ ఎంబ్రాయిడరీ దుస్తులు, నండాలనే నేలపై పరిచే తివాసీలు, పూసలు అద్దాల కుచ్చులతో చాందినీ శాలువాలు, బ్లవుజ్‌లు ఒకటేమిటి గుజరాత్ హస్తకళా వైభవం అంతా ఈ మార్కెట్‌లో పరుచుకుని ఉంటుంది. అలాగే గుజరాత్ హస్తకళల్లోనే వస్త్రాలకు ప్రత్యేకస్థానం. అందాలొలికే పనితనం, లోపాలకు ఆస్కారం లేని కచ్చితత్వం ఇక్కడి స్త్రీల చేతుల్లో తయారయ్యే ప్రతి వస్తువు రుజువు చేస్తుంది. ఈ మార్కెట్‌లో దొరకని వస్తువు ఉండదు. గుండుసూది నుంచి డిజైనర్ దుస్తుల వరకు, మసాలా దినుసులు, మాంసం, కూరగాయలు, మతపరమైన ఆరాధనా వస్తువులు సర్వం ఇక్కడ దొరుకుతాయి.

ఇక్కడ స్త్రీలు ఎంతో చైతన్యంతో ఉంటారు. సామాజిక అంశాలు, రాజకీయాలు చర్చిస్తారు. ఈ మార్కెట్‌లో వ్యాపారం చేసే మహిళలకు సంఘం ఉంది. వ్యాపారం చేసే మహిళలు తమ తల్లుల నుంచి వారసత్వంగా సభ్యత్వాన్ని పొందుతారు. మగవాళ్లకి వ్యాపారం కోసం అయితే అడుగుపెట్టే అవకాశం అస్సలు ఇవ్వరు. వర్తమానంలోనే కాదు, సా మాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. మణిపూర్ అందా లు చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఈ మార్కెట్‌ను తప్పకుండా చూస్తారు.

Ima Keithel Women Market Imphal Manipur India