Thursday, March 28, 2024

ఈసారి తాలిబన్లకు లోన్లు కుదరవు: ఐఎంఎఫ్

- Advertisement -
- Advertisement -

IMF Not Give Funds To Taliban Government

వాషింగ్టన్: అఫ్ఘనిస్థాన్‌లోని నూతన ప్రభుత్వానికి ఈసారి తమ నుంచి ఎటువంటి రుణాలు లేదా ఆర్థిక వనరులు కల్పించే ప్రసక్తే లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. అఫ్ఘన్‌లో అధికార మార్పిడి తరువాతి పరిణామాల నేపథ్యంలో ఈ 190 దేశాల సంస్థ స్పందించింది. ఇటువంటి అంశాలపై తాము అంతర్జాతీయ సమాజం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తీరాల్సి ఉంటుందని ప్రకటన వెలువరించారు. అక్కడ ప్రభుత్వంపై స్పష్టత రాలేదు. ఇప్పటికీ వివిధ దేశాల నుంచి గుర్తింపు దక్కలేదు. ఈ దశలో అక్కడి అధికారిక వ్యవస్థకు ఎటువంటి ఎస్‌డిఆర్‌లు లేదా ఇతర వనరులను కల్పించడం కుదరదని తెలిపారు. వివిధ దేశాలలో చెల్లింపులు, తక్షణ అవసరాలకు సంబంధించి సాయం పొందేందుకు సభ్యదేశాలకు అవకాశం కల్పించే ప్రత్యేక వనరుల హక్కును ఎస్‌డిఆర్ అంటారు.

IMF Not Give Funds To Taliban Government

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News