Friday, April 19, 2024

కోడ్‌లేని జిల్లాల్లో తక్షణమే ఉద్యోగుల విభజన

- Advertisement -
- Advertisement -

Immediate division of Employees in codeless districts

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

రాష్ట్రపతి ఉత్తర్వులకు
లోబడి కొత్త జోనల్
విధానానికి అనుగుణంగా
విభజన జిల్లాస్థాయి
పోస్టులకు ఉమ్మడి జిల్లా
కలెక్టర్ నేతృత్వంలో కమిటీ
జోనల్ పోస్టులకు
మల్టీ జోనల్ పోస్టులకు
జిఎడి ముఖ్య కార్యదర్శి
సారథ్యంలో కమిటీలు

మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల జారీతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ ఆయా జిల్లాల్లో ప్రారంభమవుతుంది.

ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విభజన ప్రక్రియ ప్రభుత్వం చేపట్టడంతో సంతోషం వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి, కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, జోనల్ పోస్టులకు, మల్టీ జోనల్ పోస్టులకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీలో ఆయా శాఖల జిల్లా అధిపతులను సభ్యులుగా నియమించింది.

జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజనకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, ఆర్థికశాఖ నుంచి సీనియర్ కన్సల్టెంట్, ఇతర సీనియర్ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకొని సీనియారిటీ ప్రాతిపదికన స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వారికి కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన ఉంటుంది. ప్రత్యేక కేటగిరీల్లో భాగంగా 70 శాతానికి పైగా సమస్య ఉన్న దివ్యాంగులకు, పిల్లల్లో మానసిక దివ్యాంగులు ఉన్న ఉద్యోగులు, వితంతువులు,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ ప్రారంభించనున్న ప్రభుత్వం.. మిగతా జిల్లాల్లో కోడ్ అనంతరం ప్రక్రియ చేపట్టనుంది. విభజన, కేటాయింపులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత శాఖల కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News