Friday, March 29, 2024

పన్ను చెల్లింపుదారులకు ఊరట

- Advertisement -
- Advertisement -

 IT Refunds

 

రూ.5 లక్షల వరకు ఐటి రీఫండ్‌లు తక్షణమే విడుదల
లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వం నిర్ణయం
14లక్షల మందికి ప్రయోజనం

న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభం దృష్ట్యా ఆదా యం పన్ను చెల్లింపుదారులకు ఐటి శాఖ ఊరటనిచ్చిది. పెండింగ్‌లో ఉన్న రూ.5 లక్ష ల వరకు ఆదాయం పన్ను రీఫండ్‌లను తక్షణమే విడుదల చేయనున్నట్టు ఐటి శాఖ ప్రకటించింది. వ్యక్తిగత, వ్యాపార సంస్థలకు తక్షణమే పెండింగ్ రీఫండ్‌లను అందివ్వాలని ఐటి నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఐటి శాఖ ఈ నిర్ణయం తీసుకుం ది. ఈ నిర్ణయంతో దాదాపు 14లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తు త కరోనా సంక్షోభ పరిస్థితుల్లో వేతనాల్లో కోత లేదా ఉద్యోగాలు కోల్పోవడం, జీతా ల కోసం ఎదురుచూపుల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నిర్ణయం ఉపశమనం కల్గించనుంది. ఆదాయపు పన్ను రీఫండ్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని జిఎస్‌టి, కస్టమ్ రీఫండ్‌లను కూడా విడుదల చేస్తామని ఐటి శాఖ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొంది. మొత్తం రూ.18 వేల కోట్ల రీఫండ్‌ను ప్రభుత్వం జారీ చేయనుందని, దీంతో లక్ష మంది వ్యాపారవేత్తలకు ప్రయోజనం ఉంటుందని సమాచారం.

Immediate release of IT Refunds up to Rs 5 Lakhs
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News