లాస్ ఏంజెల్స్ కు అదనపు బలగాలు తరలించిన ట్రంప్
ట్రంప్ పై దావాకు సిద్ధమైన కాలిఫోర్నియా స్టేట్
లాస్ ఏంజెల్స్: వలసదారుల నిరసనలు మరింత ఉధృతం అయిన తరుణంలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ లాస్ ఏంజెల్స్ లో అదనంగా దాదాపు 700 మంది మెరైన్ లను మోహరించాలని ఆదేశించారు. తన దూకుడు వలస విధానాలనకు నిరసన తెలుపుతున్న వారిపై గతంలో కంటే తీవ్రంగా విరుచుకు పడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
సోమవారం వరుసగా నాల్గో రోజున కూడా వలసదారుల నిరసనలు కొనసాగాయి.
వలసదారులను నిర్బధించిన ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ ఎదట వేలాది మంది ప్రదర్శనకారులు గుమికూడారు. నిరసన తెలిపారు. లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్ లోని విధుల్లో పెద్దఎత్తున గుమికూడిన ప్రజలను వెంటనే ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఆ తర్వాత మెరుపు లాఠీలను విసిరి, రబ్బర్ బులెట్లతో కాల్పులు జరిపారు. ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ వెలుపల గుమికూడిన ప్రదర్శన కారులు ఆక్కడి నేషనల్ గార్డ్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నినాదాలు చేశారు. పందులూ.. ఇళ్లకు పొండి.. షేమ్ షేమ్…షేమ్.. అని విమర్శించారు.
ట్రంప్ ఆదేశించినట్లు మరిన్ని నేషనల్ గార్డ్ బలగాలను తరలించేవరకూ, ఫెడరల్ ప్రభుత్వం ఆస్తులను పరిరక్షించేందుకు, సిబ్బందిని కాపాడేందుకు మెరైన్ల బెటాలియన్ లను పంపుతామని ఆమెరికా ఆర్మీ తెలిపింది. ఫెడరల్ గవర్నమెంట్ ఆస్తులు, భవనాలకు ముప్పు పెరుగుతున్నందువల్ల, శాంతి భద్రతల పరిరక్షణకు దాదాపు 700 మంది యాక్టివ్ – డ్యూటీ యూఎస్ మెరైన్ లను లాస్ ఏంజెల్స్ లో మోహరించినట్లు అమెరికా రక్షణమంత్రి పీటర్ హెగ్సేత్ తెలిపారు.కాగా, మెరైన్ లు
నగరానికి వస్తారని తమకు అధికారికంగా ఏలాంటి నోటిఫికేషన్ రాలేదని లాస్ ఏంజెల్స్ పోలీసు చీఫ్ జిమ్ మెక్ డోన్నెల్ తెలిపారు.
ట్రంప్ పై దావాకు సిద్ధమైన కాలిఫోర్నియా మరోవైపు కాలిఫోర్నియా స్టేట్ సోమవారం ట్రంప్ పాలనపై నేషనల్ గార్డ్, మెరైన్ల
మోహరింపును నిరోధించాలని దావా వేసింది. ఇది ఫెడరల్ స్టేట్ సార్వభౌమత్వం ఉల్లంఘన గానే వాదించింది.ట్రంప్ మొదట 2వేల మంది సైనికులను మోహరించి, తర్వాత మరో 2 వేల నేషనల్ గార్డ్ దళాలను మోహరిస్తున్నట్లు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తెలిపారు.