* 2019లో కాంగ్రెస్‌దే అధికారం
* టి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
హుజూర్నగర్ : రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్, టిడిపి , ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు చే రబోతున్నారని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమా ర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లోకి వచ్చేవారిని స్వా గతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో త్వ రలోనే విప్లవాత్మకమైన సమీకరణలు చోటు చేసు కుంటాయన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమా వే శంలో ఆయన మాట్లాడారు. 2019లో కాంగ్రె స్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అ నంతరం అఖిలపక్ష రైతు సంఘ నాయకుల ఆధ్వ ర్యంలో సాగర్ ఎడమ కాలువ ఆధునీకరణ పనుల గురించి వివరించిన వినతిపత్రాన్ని ఉత్తమ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, హరి బాబు, వెంకన్న గౌడ్, రాజారావు, మల్లి కార్జున్, శ్రీనివాస్ యాదవ్, వెంకట రెడ్డి, కృష్ణారెడ్డి, సీత య్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.