Home తాజా వార్తలు గురుకులాల్లో ఇంపాక్ట్ కార్యక్రమం

గురుకులాల్లో ఇంపాక్ట్ కార్యక్రమం

Praveen-Kumar

తొలి సారి తెలుగు భాషలో విద్యా ప్రణాళిక
సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలోని గురుకుల పాఠశాలల్లో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇం పాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, నల్ల వాగు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బడులల్లో జరిగిన ఇంపాక్ట్ కార్యక్రమాలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెలవుల ముందు విద్యార్థుల ప్రతిభ పాటవాలపై తల్లిదండ్రులు నేరుగా ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. తొలి సారి తెలుగు భాషలో ప్రతీగతి నివేదిక, విద్యా నివేదికలను తల్లిదండ్రులకు అందిస్తున్నామని తెలిపారు. సిఎంకెసిఆర్ కెజిటూ పిజి ఉచిత విద్యా పథకంలో భాగంగా ప్రత్యేకంగా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ విద్యా సొసైటీల ద్వారా విస్తృతంగా గురుకుల బడులను ప్రారంభించామని గుర్తు చేశారు.

దసరా సెలవుల సందర్భంగా చివరి రోజు ఇం పాక్ట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాధించిన విజయాలను తెలిజేయు ప్రగతి నివేదిక, విద్యా ప్రణాళికను తల్లిదండ్రులకు ఆయా పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు అందజేశారు. విద్యార్థుల ప్రగతి నివేదిక ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల సాధించిన ప్రగతి, విజయాల పై భవిష్యత్ కార్యచరణ ప్రణాళిక రూపొందించే అస్కారం కల్గుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్వేరో నాయకులు, తల్లిదండ్రులు, సంఘ నాయకులు, అతిథులకు ఆయా పాఠశాల విద్యార్థులు అభివృద్ధిలో తమ వంతు ఎలా కృషి చేయాలి అనేది తల్లిదండ్రలకు వివరించామని తెలిపారు. ప్రతి సెలవులకు ముందు జరిపే ఈ కార్యక్రమాని విశేష స్పందన లభిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల తెరిచిన వెంటనే విద్యార్థులు తప్పనిసరిగా వచ్చే విధంగా పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు ప్రేరణ కల్పించారని ఆయన పేర్కొన్నారు.

Impact program in Gurukulam Schools