Home తాజా వార్తలు స్టెరాయిడ్స్‌తో చెక్

స్టెరాయిడ్స్‌తో చెక్

Implement standard Covid care protocols at hospitals

 

సిటిస్కాన్‌తో పెద్దగా ప్రయోజనం లేదు కరోనాకు రాష్ట్రమంతట ఒకే వైద్యవిధానం ఉండాలి
జిల్లాల వైద్య అధికారులకు వీడియోకాన్ఫరెన్స్‌లో అమెరికాలో ప్రముఖ వైద్యనిపుణులు డా. విజయ్ ఎల్దండి సూచనలు
రోగులకు భరోసా బాధ్యత వైద్యులదే : మంత్రి ఈటల

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా చికిత్సకు యాంటీవైరల్ డ్రగ్స్ కంటే స్టెరాయిడ్ మందులు ఎక్కువ మందికి నయం చేస్తాయని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ్ ఎల్దండి అన్నారు. వ్యాధి నిర్ధారణ కాగానే డెక్సా మితాజోన్ వంటి మందులు ఇవ్వడం వలన వెంటిలేటర్ మీదకు వెళ్లే వారి సంఖ్యను తగ్గించవచ్చని, తద్వార మరణాల శాతం కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. సోమవారం బిఆర్‌కే భవన్ లో జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్‌లో ఆయన మంత్రి ఈటల రాజేందర్, సిఎస్ సోమేష్‌కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డిఎంఇ డా రమేశ్‌రెడ్డితో కలసి పాల్గొన్నా రు.

ఈ సందర్బంగా డా విజయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా కంటే దాని భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని ఆ యన వెల్లడించారు. ఈక్రమంలో ధైర్యమే శ్రీరామ రక్ష అని, వైద్యులు ఆ దిశగా పేషెంట్లకు భరోసాని ఇవ్వాలని ఆయన తెలిపారు. వైరస్ సోకిన రోగులకు వీలైనంత తొందరగా చికిత్సను ప్రారంభిస్తే, మరణాల శాతాన్ని మరింత తగ్గించవచ్చని ఆయన అన్నారు. కరోనా వైరస్ ఒక ప్రత్యేకమైన వైరస్ అని, దీని వ్యాప్తి ప్రస్తుతం అత్యధికంగా కలిగి ఉండటం వల్ల అధికారులతో పాటు వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ వైరస్ వలన గుండె సమస్యలు కూడా వస్తాయని తాజా అధ్యయనాల్లో తెలుతోందని,రక్తనాళల్లో రక్తం గడ్డకట్టడం వల్ల యువకులు కూడా చనిపోతున్నారని ఆయన తెలిపారు. దీంతో ప్రతి ఒక్కరూ వైరస్ సోకగానే వెంటనే ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. దీంతో పాటు ఈ మధ్యకాలంలో చాలా మంది సిటీస్కాన్ చేస్తున్నారని, దాని వల్ల కరోనాను స్పష్టంగా నిర్ధారించలేమని స్పష్టం చేశారు.

మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పద్దతులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆసుపత్రిలో అందిస్తామన్నారు. కరోనాకి రాష్ట్రమంతా ఒకే వైద్యవిధానం ఉండాలన్నారు. ఇప్పటికే డాక్టర్స్‌కి పూర్తిస్థాయిలో రక్షణ, భరోసాను ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఏ ఒక్క రోగిని వెనక్కి పంపించోద్దని ఆయన తెలిపారు. చికిత్స అందించి స్టెబిలైజ్ చేసిన తర్వాతనే పెద్ద ఆసుపత్రులకు పంపించాలని ఆయన జిల్లా అధికారులకు సూచించారు. ప్రతి రోగిని బ్రతికించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన వైద్యులకు విజ్ఞప్తి చేశారు. పేదరికం, నమ్మకం ఉన్న వారే ప్రభుత్వ వైద్యం కోసం వస్తున్నారని, వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత వైద్యులదేనని అన్నారు. వైద్యశారోగ్యశాఖ కెప్టెన్‌గా తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. సిఎస్ సోమేష్‌కుమార్ మాట్లాడుతూ..సిఎం ఆదేశాలతో ప్రతి రోజూ కరోనా సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

వేరే జబ్బులకు ఒక ప్రత్యేకమైన చికిత్స విధానం ఉంటుందని, దీనికి ఇప్పటి వరకు అది లేదు కావున కాస్త గందరగోళానికి గురికావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ప్రతి వైద్యులు సైకాలజిస్ట్‌గా మారి పేషెంట్లు ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. డా ఎంవిరావు మాట్లాడుతూ..పాజిటివ్ వచ్చిన రోజు నుంచే చికిత్స ప్రారంభించాలని అన్నారు. ఆక్సిజన్ అవసరమైన ప్రతి వ్యక్తికి రెమిడెసివిర్ ఇవ్వాలని సూచించారు. డా సునీత మాట్లాడుతూ..టెస్టు రిజల్ట్ కోసం వేచిచూడకుండా లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స మొదలు పెట్టాలని తెలిపారు.

డా గంగాధర్ మాట్లాడుతూ.. వైరస్ నిర్ధారణ తర్వాత ఫల్స్‌శాతాన్ని ఆక్సిమీటర్, ఎక్స్‌రే ద్వారా ఊపిరితిత్తులు ఎంత వరకు పాడయ్యాయి, సిబిపి పరీక్ష ద్వారా రక్తంలోని మార్పులను గమనించవచ్చని వెల్లడించారు. అందుబాటులో ఉంటే పేషెంట్లకు డీ డైమర్, పెరిటిన్, సిఆర్‌పి, ఐఎల్ 6 వంటి పరీక్షలు కూడా చెయొచ్చని తెలిపారు. అదే విధంగా శ్వాసతీసుకునే శాతం 92 శాతం కంటే తక్కువగా ఉంటే వెంటనే ఆక్సిజన్ అందించి స్టెరాయిడ్స్ ఇవ్వాలని, డెక్షా మితాజోన్ పాయింట్ 0.1 ఎంజి/కెజిని ఉపయోగించాలని అన్నారు. ఈ దశలోనే రెమిడెసివీర్ ఇంజిక్షన్ లేదా ప్లాస్మా థెరపీ వంటివి చేయాలని తెలిపారు.

Implement standard Covid care protocols at hospitals