Home ఎడిటోరియల్ రక్షణ కార్పొరేటీకరణ ఆపాలి

రక్షణ కార్పొరేటీకరణ ఆపాలి

Cartoon

 

చర్చల పేరుతో జాతీయ యూనియన్, అసోసియేషన్ నాయకులను పిలిపించుకుని అడిషనల్ చైర్మన్ (డిపి) తో ఎలాంటి పరిష్కారం చూపకుండా మీరు ‘నిరవధిక సమ్మె’ను విరమించుకోండి కేంద్ర ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పటం యూనియన్ అసోసియేషన్ నాయకులను వెనుకకు తిరిగి పంపించటం అత్యంత బాధాకరమైన విషయం. 20.08.2019 దేశ వ్యాప్తంగా 41 ఆర్డినెన్సు ఫ్యాక్టరీలలోని కార్మికులు నిరసన జ్వాలలు ఉవ్వెత్తున వినిపించినా..! కలకత్తా ఒఎఫ్‌బి నుంచి ప్రెస్ నోట్ విడుదల చేశారు.

రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధ కర్మాగారాలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. 218 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆయుధ కర్మాగారాలు దేశవ్యాప్తంగా మొత్తం 41 వరకు ఉండగా సుమారు 82,000 వేల మంది కార్మికులు రాత్రి/పగలు విధులు నిర్వహిస్తున్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ త్రివిధ దళాలైన ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్, సి.ఆర్.పి.యఫ్, సి.ఐ.యస్.ఫ్, బి.యస్.ఫ్, స్టేట్ గవర్నమెంట్ లోని పోలీసు డిపార్టుమెంట్ కి సంబంధించిన తుపాకులు, మందుగుండు సామగ్రి, అధునాతన ఆయుధాలు, యుద్ద వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, జాకెట్లు, షూస్ ఇలా విభిన్నమైన వస్తువులను, పరికరాలను, వాహనాలను తయారు చేసి ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నాయి.

కార్గిల్ యుద్ధం మొదలు నిన్న మొన్నటి సర్జికల్ వైమానిక దాడులు వరకూ శత్రు దేశాలను పొలిమేరలకు తరిమికొట్టి దేశ సమగ్రతను పెంపొందించాయి. అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాంకేతిక వ్యోమనౌక ‘చంద్రయాన్ 2’ లో కూడా సేవలందించి ఆయుధ కర్మాగారాల విశిష్టత చాటుకున్నాయి. ఇలా దేశ సమగ్రతలో ఆయుధ కర్మాగారాల సహకారం ఎంతైనా ఉంది. ఇంత గొప్పగా సేవలు అందించే 41 ఆయుధ కర్మాగారాలు ఈ దేశానికి ఆయువు పట్టులా, గుండెకాయలా నిలబడి దేశ రక్షణ రంగానికి కవచంలా ఉన్నాయి.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 72 సంవత్సరాల కాలంలో ఎందరో పాలకులు రక్షణ వ్యవస్థ పటిష్ట పరిచేందుకు ఎన్నో రకాలుగా సేవలందించారు. మరెన్నో అధునాతన పరికరాలు, ఆయుధాలను, వాహనాలను విదేశాల నుండి కొనుగోలు చేసి రక్షణ వ్యవస్థ ను పటిష్టం చేశారు. కానీ రెండవసారి ఎన్నికైన ఎన్‌డిఎ ప్రభుత్వం రక్షణ రంగానికి సంబంధించిన 41ఆయుధ కర్మాగారాలను ‘కార్పొరేటైజేషన్’ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు(అంబానీ, ఆదానీ.. తదితర దోపిడీ వర్గాలకు) అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు పూర్తి చేసుకుంటుంది. ఇక కేబినెట్ ఆమోదం పొంది బిల్లు ఉభయ సభల ఆమోదం పొందేందుకు మాత్రమే వేచి ఉంది.

కావున కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, అనుబంధ విభాగాల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగులందరూ విధిగా ఈ “నిరవధిక సమ్మె’ లో పాల్గొని కార్పొరేట్ వ్యక్తులకు ఈ దేశ రక్షణ వ్యవస్థను దోచిపెట్టే ఆలోచనలు చేస్తున్న ఈ కాషాయపు పాలకుల నియంతృత్వ వైఖరిని ప్రశ్నించేలా..! కొన్ని లక్షల మంది కార్మికులు గొంతెత్తి నినదిస్తున్నారు. లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ‘కార్పొరేటైజేషన్’ వలన రోడ్డు న పడే అవకాశాలు ఉన్నాయి. కనుక దేశమంతటా విస్తృతంగా ‘నిరవధిక సమ్మె’ జరుగుతుంటే..! ఈ ప్రభుత్వం ‘దున్నపోతు మీద వర్షం కురుస్తున్నట్లు’ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఇది అత్యంత బాధాకరమైన విషయం.

చర్చల పేరుతో జాతీయ యూనియన్, అసోసియేషన్ నాయకులను పిలిపించుకుని అడిషనల్ చైర్మన్ (డిపి) తో ఎలాంటి పరిష్కారం చూపకుండా మీరు ‘నిరవధిక సమ్మె’ను విరమించుకోండి కేంద్ర ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పటం యూనియన్ అసోసియేషన్ నాయకులను వెనుకకు తిరిగి పంపించటం అత్యంత బాధాకరమైన విషయం. 20.08.2019 దేశ వ్యాప్తంగా 41 ఆర్డినెన్సు ఫ్యాక్టరీలలోని కార్మికులు నిరసన జ్వాలలు ఉవ్వెత్తున వినిపించినా..! కలకత్తా ఒఎఫ్‌బి నుంచి ప్రెస్ నోట్ విడుదల చేశారు. కేవలం కార్పొరేట్ భాగస్వామ్యంతోనే ఈ దేశ రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. స్వతహాగా స్వేచ్ఛతో సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందాలి. అది కార్పొరేట్ వ్యవస్థతోనే సాధ్యం అవుతుందని మీరు మీ నెల రోజుల ‘నిరవధిక సమ్మె’ ను విరమించుకోవాలని ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఇప్పుడు చెప్పండి సోదరా, సోదరీమణులారా ఈ ప్రభుత్వం ‘దున్నపోతు మీద వాన పడ్డట్లు’ వ్యవహరిస్తున్న తీరు ను చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. కనుక ఈ దేశ ప్రగతి, అభివృద్ధి కోసం పని చేయడం ప్రభుత్వ అజమాయిషీలోనే ప్రభుత్వ సంస్థలు గానే పని చేయాలి. ఇదే కదా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నేది…! అందుకోసం ప్రతి ఒక్కరూ (అసోసియేషన్, ట్రేడ్ యూనియన్, సిఆర్‌డిఎ) విధిగా ఈ చారిత్రాత్మక 30 రోజుల ‘నిరవధిక సమ్మె’లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన మన రక్షణ రంగ ఆయుధ కర్మాగారాలను కాపాడుకుందాం..!

improve the efficiency of the 41 factories it operates