Friday, March 29, 2024

ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు నిరసనగా పాక్ లో ఆందోళనలు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌పై పాక్ ప్రభుత్వం స్పందించింది. అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇమ్రాన్‌ఖాన్‌కు అరెస్ట్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో ఆయన మద్దతుదారులు, పిటిఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిరసనకారులపై పాక్ భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొడుతున్నారు. పిటిఐ కార్యకర్తలు పలుచోట్ల ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. కేసు విచారణ నిమిత్తం ఇస్లాబాద్ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ను పాక్ రేంజర్స్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ అరెస్టు చేసేటప్పుడు ఆయన లాయర్లు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ కారు చుట్టుముట్టి పాక్ రేంజర్లు అదుపులోకి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ రేంజర్లు అతడిని హింసిస్తున్నట్లు పాక్ రేంజర్లు పేర్కొన్నారు.

Also Read: హైదరాబాద్ లో నీడ పోయింది.. రెండు నిమిషాలు జీరో షాడో!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News