Wednesday, March 22, 2023

2019లో కాంగ్రెస్‌దే అధికారం

- Advertisement -

cong2

మన తెలంగాణ/నల్లగొండ టౌన్: కాం గ్రెస్ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి రెండోసారి ఎన్నిక కావడం హర్శించదగ్గ విషయం అని ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పెరిక వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో ఈ ఎన్నిక సందర్భంగా పెరిక వెంక టేశ్వర్లు ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని భాణా సంచ పేల్చి ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ కోసం ఆహర్నిషలు కష్టపడుతూ పార్టీ అభివృద్ధికి కృషిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెల్లడంలో ము ఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఆయన సేవలను గుర్తించి కాంగ్రెస్ అదిష్టానం సోని యగాంధీ, రాహుల్‌గాంధీ టీపీసీసీ అధ్యక్షునిగా రెండవ సారి ఎంపిక చేయడం జరిగిందని అ న్నారు. ప్రజల మన్ననలు పొందిన ఎకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఉత్తమ్ కుమార్ సారథ్య ంలో రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ డం కాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సిసెల్ మండల అధ్యక్షులు శివకుమార్, సినియర్ నాయ కులు దర్మయ్య, చిరుమర్తి శ్రీను, వడ్డెబోయిన సైదులు, సందీప్, సుధాకర్, మధు, ప్రభాకర్, జెర్రిపోతుల లింగయ్య, ఎస్. అశోక్, యశమల్ల కిరణ్, ప్రదీప్, నాగరాజు, శివ, పాండు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News