Sunday, March 26, 2023

సిటీ బస్సుల్లో నేటి నుంచి కొత్త చార్జీలు

- Advertisement -

buses

*హైదరాబాద్, వరంగల్‌లో అమలు
*ఆర్డినరీ, పల్లెవెలుగు బస్సుల్లో రూ.5కు తగ్గనున్న కనీస చార్జి

మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగరాలలో హేతుబద్ధీకరించిన ఆర్‌టిసి సిటీ బస్‌చార్జీలు ఈ నెల 15 నుంచి అమలులోకి రానున్నా యి. బస్ టిక్కెట్‌కు సరిపడా చిల్లర డబ్బులు తీసుకోవ డం, తిరిగి ఇచ్చే విషయంలో తరచూ ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో చార్జీలను క్రమబద్ధీకరించినట్లు టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.రమణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోసం సిటీ బస్ చార్జీలను హేతుబద్దీకరించాలని సిటిజెన్ కౌన్సిల్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సుల కనీస చార్జీని ప్రస్తుతం ఉన్న రూ.6, రూ.7 ల నుంచి రూ.5లకు తగ్గించగా, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్‌లలో కనీస చార్జీలను రూ. 8, రూ. 9 సవరించి రూ.10లకు సరిచేసింది. చార్జీల క్రమబద్ధీకరణలో భాగంగా రూ.13 నుంచి రూ. రూ.17 వరకు ఉన్న చార్జీలను రూ.15లకు సవరించారు. రూ.18 నుంచి రూ.22 వరకు ఉన్న చార్జీలను సవరిస్తూ రూ.20గా నిర్ణయించారు. రూ.23 నుంచి రూ.27 చార్జీలను రూ.25లు చేశారు. రూ.29 నుంచి రూ.31ఉన్న చార్జీలను రూ.30గా నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఆర్‌టిసి కనీస ఛార్జీని రూ.5 లకు తగ్గించడం మంచిదే అయినప్పటికీ రెండు కంటే ఎక్కువ స్టాపుల దూరం వెళ్ళే ప్రయాణికులపై ప్రస్తుతం చెల్లిస్తున్న ఛార్జీలపై రూ.2ల భారం పడుతుందని కొంత మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News