*పాటించని నిబంధనలు
*విద్యార్థులకు అందని నాణ్యమైన
విద్య
* ప్రయోగాలలో పట్టును
కోల్పోతున్న విద్యార్థులు, ఆసక్తి
చూపని ఉపాధ్యాయులు
* నిరుపయోగంగా ఉన్న
పాఠశాలలు
మన తెలంగాణ/పెన్‌పహాడ్: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో విఫలమవుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచి విద్యార్థులను పాఠశాల వైపు ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలన్నీ వృథా కావడం శోచనీయం. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అదే విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో పాఠశాలల్లో ప్రయోగాలకు విద్యార్థులు దూరమవుతున్నారు. మండల పరిధిలోని అనేక పాఠశాలల్లో కంప్యూటర్లు నిరూపయోగంగా ఉన్నాయి. మండలంలోని అనేక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సామాన్య శాస్త్రం అంశాలలో సంబంధించిన ప్రయోగాలు చేయడానికి సరైన పరికరాలు, ప్రయోగశాలలు లేక పాఠాలకే పరిమితమవుతున్నారు. అదే విధంగా ప్రయోగాలకు సంబంధించిన సామాగ్రి ఉన్నప్పటికీ వాటిలో ఉపయోగించే రసాయనాలు సరిపడ అందుబాటులో లేకపోవడంతో ప్రయోగాలు నామమాత్రంగా జరుగుతున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో అవి నిరూపయోగంగా ఉన్నాయి. భౌతిక, జీవ రసాయన శాస్త్రాలలో సరైన రీతి లో ప్రయోగాలు చేయించకపోవడంతో పాఠశాల స్థాయిలో సంబంధిత సబ్జెక్టులలో విద్యార్థులు వెనకబడుతున్నా రు. దీనితో పై తరగతులకు వెళ్లి విద్యనభ్యసించడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం, ఉపాధ్యాయులు స రైన శ్రద్ధ తీసుకొని హై స్కూల్ స్థాయిలో ప్రయో గ సామాగ్రి, రసాయన పదార్థాలు అందుబాటు లో ఉం చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.