Home ఎడిటోరియల్ జైళ్ళు సరిపోవాలంటే….?

జైళ్ళు సరిపోవాలంటే….?

Cartoonsరాజస్థాన్ రస్తాలో శాశ్వత పెరోల్

దేశంలోని చాలా జైళ్లలో సామర్థ్యాన్ని మించి ఖైదీలున్నారు. సగటున ఇది 150 శాతం ఉంది. ఖైదీలకు శాశ్వత పెరోల్, బహిరంగ జైళ్లు వంటి నియమాలను జైళ్ల సంస్కరణలలో భాగంగా ప్రవేశపెట్టాలని, అలా చేస్తే సమస్య తీవ్రత బాగా తగ్గుతుందని సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక కేసులో పలు రాష్ట్రాల నుంచి సమాచారాన్ని ఈ విషయంలో సుప్రీంకోర్టు కోరుతొంది. దేశ వ్యాప్తంగా గల 1,382 జైళ్లలో జీవనపరిస్థితులను సుప్రీంకోర్టు వాక బు చేస్తోంది. ముఖ్యంగా అవి ఎంతవరకూ క్రిక్కిరిసి ఉన్నాయి, అస హజ మరణాలు సంభవిస్తున్నాయా అన్నది ప్రత్యేకంగా విచారి స్తున్నారు. 2014నుంచి ఈ కేసు విచారణలో ఉంది. జస్టిస్ మదన్ బి లోకూర్ సారథ్యాన గల బెంచ్ విచారణను సాగిస్తోంది. ఈ అంశంపై రాసిన లేఖను భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌సి ఠాకూర్ పిల్‌గా స్వీకరించి విచారణ జరుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి ఈ విషయంలో ఎటువంటి కదలిక లేకపోవడంతో ఖైదీలకు న్యాయం చేకూర్చేందుకు న్యాయమూర్తుల తాపత్రయం దీనిలో వ్యక్తమవుతోంది. ఖైదీల బాధలను తీర్చేందుకు సకాలంలో చర్యలు తీసుకోవాలన్న స్పృహ రాష్ట్రాలకు కొరవడింది. ఈ నెల3న కోర్టుకు అందిన సమాచారం ప్రకారం దేశంలోని అనేక జైళ్లు 150 శాతం క్రిక్కిరిసి ఉన్నాయి. అత్యధికంగా యుపిలో 47 జైళ్లలో ఆ పరిస్థితి ఉంది. అతితక్కువగా 3 జైళ్లు జార్ఖండ్‌లో అలా క్రిక్కిరిసి ఉండగా, అసోంలో 8, చత్తీస్ గఢ్‌లో 17, కర్నాటకలో 7, కేరళలో 21, మధ్య ప్రదేశ్‌లో 5, మహారాష్ట్రలో 16, రాజస్థాన్‌లో 21, ఢిల్లీలో 12 జైళ్లలో సామర్ధానికి మించి ఖైదీలున్నారు. జైళ్లలో ఈ సమస్యను తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించా లని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆదేశించింది. కాని ఒక్క రాష్ట్రంకూడా స్పందించలేదు.

తక్షణం ఈ సమస్య పరిష్కారానికి కొత్తగా జైళ్లను నిర్మించడం ఒక మార్గం. పూర్వకాలంలో కట్టిన చాలా పెద్దపెద్ద జైళ్లు నగరాల్లో ఉన్నాయి. అవి సరైన నిర్మాణాలు కావు. కోర్టుల సమీపంలో అవి ఉన్నవి కాబట్టి కొత్త జైళ్లను నగరం వెలుపల విస్తార ప్రదేశాల్లో నిర్మిం చాలి. నగరాలలో భూముల ఖరీదు, జనంఖ్యను దృష్టిలో పెట్టుకొంటే వాటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకొన్నది. నగరాల వెలుపలే జైళ్ల ను నిర్మించడం తక్కువ ఖర్చుతో కూడినదైనా, కోర్టుకు ఖైదీలను తీసు కు వెళ్లి, తీసుకు రావడంలో చాలా తలనొప్పులు ఎదురు కావ చ్చు. ఇందుకు ఎక్కువ మంది గార్డులు, వాహనాలు కావాల్సి వస్తుం ది. పోలీసు శాఖకు వ్యయభారం అధికంగా ఉన్న ప్రస్తుత సమయం లో ఇది మరింత భారం అవుతుంది. జైళ్లను నగరం పెలుపలకు తర లించడం కూడా కష్టంతో కూడుకొన్నది. కోర్టులో నిందితుని హాజరు పరచడానికి ఏ అడ్డంకి ఏర్పడినా ఖైదీకి న్యాయాన్ని తిరస్కరించ డానికి దారితీయవచ్చు. అంతేకాక కొత్త జైళ్ల నిర్మాణానికి చాలా కాలం పడుతుంది. ఈ సమస్యకు విడియో కాన్ఫరెనింగ్ విచారణలు పరిష్కార మన్న సూచన కూడా ఉంది. కానీ ఆ పద్ధతిని భారీ ఎత్తున నిర్వ హించడంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అతిగాక్రిక్కిరిసిన జైళ్ల ఖైదీలు కొంతమందిని వాటి ఆవరణలో నిర్మించిన తాత్కాలిక శిబి రాల్లో ఉంచాలి. లేదంటే వార్డుల వెంబడిగల కారిడార్లలో నిద్రించే ఏర్పాటు చేయాలి. దీని అమలుకు చాలినంతమంది జైలు గార్డులు ప్రస్తుతం లేరు. అందుకే ఈ విధానాన్ని చాలా జైళ్ల విభాగాలు తిరస్కరిస్తున్నాయి. సిఆర్‌పిసి సెక్షన్ 437 క్రింద విచారణ ఖైదీ లను విడుదల చేయడానికి గల అవకాశాలను శోధించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సూచిం చింది. బెయిలు మంజూరు చేయడం, కేసును డిస్మిస్ చేయడం కూడా న్యాయ మూర్తుల విచక్ష ణపై ఆధారపడి ఉంది. అరెస్టు చేసిన 24 గంట లలోగా నిందితుని కోర్టులో హాజరుపరచాలన్న నిబంధన అమలులో రాష్ట్రా లు చతికిల బడ్డాయి. జైళ్లలో నేరనిర్ధారణ జరిగిన ఖైదీల సంఖ్యను తగ్గించడం ద్వారా ఈ సమస్యను అధిగమించ వచ్చు. 2014 జైళ్ల గణాంకాలను బ ట్టి జైళ్ల జనా భాలో నేరం రుజువైన ఖైదీల సంఖ్య 31శాతం. 1960 దశకం మొదట్లో ప్రారంభిం చిన కొన్ని పురోగామి చర్యలను ఇప్పుడు మళ్లీ పరిశీలిం చాలన్న సూచన కూడా ఉంది. రాజస్థాన్‌లో పేరోల్‌పై ఖైదీ ల విడుదలకు సంబంధించిన 1958 నిబంధనలలో శాశ్వత పేరోల్ నిబంధన ఉంది. దాని ప్రకారం ఖైదీ తన జైలు శిక్ష కాలంలో జైలు వెలుపల ఉంటాడు.

శాశ్వత పేరోల్‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సార థ్యంలోని కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. అది ఆ సిఫారులపై నిర్ణయం తీసుకొంటుంది. సాధారణంగా కమిటీ సిఫార్సులను రాష్ట్రం ఆమోదిస్తుందని ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ఉన్నతా ధికారి అజిత్ సింగ్ చెప్పారు. గత ఏడాది 176 మందిని శాశ్వత పేరోల్‌పై విడుదలకు సిఫార్సు చేయగా 175 మంది విడుద లైనట్లు తెలిపారు. ఈ నిబంధనను ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించడం ఉత్తమమని ఆయన సూచించారు. రాజస్థాన్ లో28 బహిరంగ జైళ్లు లేదా శిబిరాలు కూడా ఉన్నాయి. అక్కడ ఖైదీలు ఉదయం పూట జీవిక కోసం బయటతిరిగి రాత్రి మాత్రమే జైలుకు వస్తారు. ఖైదీల కుటుం బాలను కూడా ఆ శిబి రాలలో ఉండనిస్తారు. 1960 దశకం నుంచీ ఇటువంటి బహిరంగ జైళ్లు ఆ రాష్ట్రంలో ఉన్నా యి. అటు వంటివి మరిన్ని రాబోతున్నా యి. కొన్ని ఇతర రాష్ట్రాలు అనుకరించ బోయి విఫల మయ్యా యి. ఎవరైనా నేరస్థునికి అయిదేళ్ల జైలు శిక్షపడి, అందులో మూడోవంతు పూర్తయితే ఇటువంటి శిబిరంలో ఉండడానికి అర్హు లౌతారు. కొన్ని సందర్భాలలో ఈ శిబిరాల నుంచి వెళ్లడానికి కొందరు ఖైదీలు నిరాక రిస్తు న్నారు. శిక్షలు పడిన వారి పునరావాసానికి రాజస్థాన్ అద్భుత ప్రయోగాలను జరుపు తోందని సింగ్ వివరణబట్టి తెలుస్తోం ది. విచారణలోని ఖైదీల సమస్య ఆ రాష్ట్రంలో అధికంగా ఉండడంతో ఈ మార్గాన్ని అది అనుసరిస్తోందని భావించాలి. ఇందులో యావద్దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యకు పరిష్కారం ఉంది.

– స్మితా చక్రవర్తి