Saturday, March 25, 2023

మార్చిలోగా వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి

- Advertisement -

collector

*జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

మన తెలంగాణ/కలెక్టరేట్: మార్చిలోగా వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. శనివారం కలెక్టరేటు సమావేశ మందిరంలో పంచాయితీ విస్తరణ అధికారులు, గ్రామ పంచాయితీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 15 లోగా వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని అన్నారు. ఇంటి పన్నుల వసూళ్లలో వెనుకబడిన మండలాలు, గ్రామ పంచాయితీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మిగిలిన మరుగుదొడ్లను ఎస్‌బిఎంలో 1800, ఇజిఎస్‌లో 1300 వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. 75 శాతం లోపు వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శలకు షోకాజ్ నోటీసులు పంపిస్తామని తెలిపారు. స్వచ్చ భారత్‌లో భాగంగా జిల్లాలోగల 276 గ్రామ పంచాయితీలకు గాను 75 శాతం గ్రామ పంచాయతీలు 70 ఎంపిక చేసి ఈ గ్రామాలలో ఆరోగ్యం, విద్య, వైద్య కార్యక్రమాలతో పాటు స్వచ్చ భారత్ అంశాలు యూనిఫెస్ సహకారంతో ఓడిఎఫ్ సుస్థిరత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రావీణ్య, డిపిఓ నారాయణ రావు, ఎస్బిఎం కో ఆర్డినేటర్ కిషస్ స్వామిచ ఇఓపిఆర్ అండ్ ఆర్ డిలు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News