Home ఎడిటోరియల్ నాగా ఒప్పందం నిలుస్తుందా?

నాగా ఒప్పందం నిలుస్తుందా?

Naga

 

భారత ప్రభుత్వం నాగా సమస్య తుది పరిష్కారానికి సమాయత్తమవుతోంది. అక్టోబర్ 31వ తేదీన ఒప్పందానికి తేదీ కూడా నిర్ణయమైపోయింది. కాని ఈ ఒప్పందం విషయం లో నాగా గ్రూపుల్లో విభేదాలు బయటపడుతున్నాయి. నాగా గ్రూపుల్లో అతి పెద్ద గ్రూపు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిం. ఈ గ్రూపు భారత ప్రభుత్వంతో విభేదిస్తోంది. తమకు ప్రత్యేక జెండా, రాజ్యాంగం లేకుండా ఒప్పందానికి వచ్చేది లేదంటున్నారు. కాని ఇతర నాగా గ్రూపులు సానుకూలంగా మాట్లాడుతున్నాయి. కేంద్రంతో చర్చల తర్వాత ఒప్పందంపై సంతకాలు చేయడానికి సిద్ధపడుతున్నాయి. తమ డిమాండ్లు చాలా వరకు ఒప్పుకున్నట్లే కాబట్టి సంతకాలు చేయడమే మంచిదని వాదిస్తున్నాయి. నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్స్ వర్కింగ్ కమిటీ ఒకటి ఏర్పడింది. ఈ కమిటీ సభ్యుల్లో చాలా మంది ఒప్పందం పట్ల సానుకూలంగా ఉన్నారు. నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్స్ వర్కింగ్ కమిటీలో ఏడు నాగా సాయుధ గ్రూపులున్నాయి.

ఈ గ్రూపుల సభ్యులు కొందరు ఒప్పందం కుదుర్చుకోవడమే మంచిద ని అభిప్రాయపడు తున్నారు. నాగాలాండ్ ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగానికి సంబంధించి తర్వాత మాట్లాడుకోవచ్చని భావిస్తున్నాయి. కాని నాగాలాండ్ రాజకీయాలను గమనిస్తున్న పరిశీలకులు ఈ ఒప్పందంలో కొన్ని గ్రూపులు ఒప్పుకోకపోవడం, ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల సమస్య ఎలాంటిదలాగే ఉంటుందని, ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయని భావి స్తున్నారు. ఇంతకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నమే 1975లో చేసింది. షిల్లాంగ్ ఒప్పందం పేరుతో ఒప్పందం కుదుర్చుకు న్నారు. నాగా సాయుధ ఉద్యమం అనేక ముక్కలుగా మారిపో యిందప్పుడు. వివిధ గ్రూపుల మధ్య ఘర్షణల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం కొన్ని గ్రూపులతో మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంటే, నాగా గ్రూపుల మధ్య ఘర్షణలు కూడా మొదలు కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర పునరా వృతమవుతుంది. చాలా మంది విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని ప్రకటించారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా నాగా జాతీయవాదులు ప్రభుత్వంతో పోరాడుతున్నారు. తమకు స్వంత సార్వభౌమాధి కారమున్న మాతృభూమి కావాలనే డిమాండ్లు వినిపించాయి. కేవలం నాగాలాండ్ మాత్రమే కాదు, నాగాల జనాభా ఉన్న మణిపూర్, అసోం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు సరిహద్దు కు అవతల మయన్మార్‌లో నాగాల జనాభా ఉన్న ప్రాంతాలన్నీ కలిపి తమకు ప్రత్యేక దేశం కోసం నినాదాలు కూడా వినిపించా యి. దశాబ్దాలుగా కొనసాగిన నాగా సాయుధ పోరాటం చివరకు అనేక ముక్కలు చెక్కలయింది. ఈ గ్రూపుల మధ్య అంతర్యుద్ధాలు జరిగేవి.

1997లో నాగా సాయుధ గ్రూపుల్లో బలమైన గ్రూపు ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం చేసుకుంది. ఈ గ్రూపు భారత భూభాగంలో పని చేస్తున్న గ్రూపు. భారత ప్రభుత్వంతో చర్చలు, సంప్రదింపుల తర్వాత ఒప్పందం కుదిరింది. కాని 2015 వరకు ఈ చర్చల్లో ఎలాంటి ముందడుగు సాధ్యపడలేదు. 2015లో నరేంద్ర మోడీ ఈ గ్రూపుతో ఫ్రేం వర్క్ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం చరిత్రాత్మకమైనదని, నాగా సమస్య పరిష్కారం దిశగా ముందడుగని చాలా మంది ప్రశంసించారు. ఈ ఒప్పందం తర్వాత నిజంగానే చర్చల్లో పురోగతి కనిపించింది. తర్వాతి కొన్ని సంవత్సరాల్లో అనేక సమస్యలపై ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. ఆరు దశాబ్దాల సమస్యకు పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం ప్రారంభమైంది. అక్టోబర్ 2017 తర్వాతి నుంచి చర్చల్లో మరింత పురోగతి చోటు చేసుకుంది. మరో ఆరు నాగా సాయుధ గ్రూపులు కూడా చర్చల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చాయి.

కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. ఇవన్నీ కలిసి ఇప్పుడు నాగి నేషనల్ పొలిటికల్ గ్రూప్స్ పేరుతో ఒకే బ్లాకుగా ఏర్పడ్డాయి. ఇందులో ఎన్‌ఎస్‌సిఎన్ (కిటోవి జిమోమో),. నాగా నేషనలిస్ట్ కౌన్సిల్, ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్, ఎన్‌ఎస్‌సిఎన్ (Reformation), నేషనల్ పీపుల్స్ గవర్నరమెంట్ ఆఫ్ నాగా లాండ్ (నాన్ యకార్డ్), ది గవర్నమెంట్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నాగాలాండ్ (నాన్ యకార్ఢ్) గ్రూపులున్నాయి. తర్వాతి కాలంలో ఎన్‌ఎస్‌సిఎన్ (ఖాప్లాంగ్), అంటే ఖాంగో కోన్యాక్ నాయకత్వం లోని గ్రూపు కూడా చర్చల్లో పాలు పంచుకుంది. చర్చలు సానుకూల వాతావరణంలో ఫలితాలు సాధించే లా కనిపించాయి. కాని ఈ వాతావరణం ఎంతో కాలం కొనసాగ లేదు. చాలా విషయంల్లో ఏకాభిప్రాయం లేదు. ఒక అవగా హనకు రావడం సాధ్యపడలేదు. దాదాపు ఒక సంవత్సర కాలంగా ఎన్‌ఎస్‌సి ఎన్ (ఐఎం) భారత ప్రభుత్వంతో విభేదిస్తూ వస్తోంది. నాగాలాండ్‌కు ప్రత్యేకజెండా, ప్రత్యేక రాజ్యాంగం ఉండవల సిందేనని వాదిస్తోంది.

రెండవసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇపుడు సహనం కోల్పోతోందని భద్రతా వర్గాల్లో గుసగుస లు వినిపిస్తున్నాయి.ఆగస్టులో ఈ సూచన లు కూడా కనిపించాయి. ఆగస్టు డెడ్ లైన్ అని ఆర్.ఎన్. రవి ప్రకటించారు. ఇంటిలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి రవి ఈ చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిం చారు. నాగాలాండ్‌కు ఇప్పుడు గవర్నరుగా ఉన్నారు. చాలా కాలంగా నాగా గ్రూపుల్లో రవికి మంచి పేరుంది. కాని ఇప్పుడు పరిస్థితులు మారే సూచనలు కనబడుతున్నాయి. మీడియా ప్రకటనలో రవి చాలా సౌమ్యంగా చేసిన ప్రకటన వెనుక ఎన్‌ఎస్‌సిఎన్ (IM) గ్రూపునకు గట్టి హెచ్చరిక కూడా ఉంది. జులైలో జరిగిన ఒక సమావేశంలో కూడా రవి చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మూడు నెలల్లోగా ఒప్పందం జరగాలని రవి కఠినంగా మాట్లాడడం ప్రారం భించారు. కాని నాగా సాయుధ గ్రూపు దిగి రావడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వం ఎలాగైనా ఒప్పందం చేసుకోవాలనే తొందరలో ఉంది.

ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) ఒప్పందానికి సిద్ధంగా లేదు. మిగిలిన గ్రూపులు సిద్ధపడినా, అతిపెద్ద గ్రూపు ఒప్పందం లో లేకపోతే సమస్య పరిష్కారమైనట్లు భావించలేం. అక్టోబర్ 31 నాటికి మూడు నెలల వ్యవధి గడిచి పోతుంది. అప్పటి లోగా ఎన్‌ఎస్‌సిఎన్ (IM) మనసు మార్చుకుని సంతకం చేస్తుందా? నాగా పౌర సమాజం చాలా బలమైనది. ప్రజలకు సంబంధించిన ఏ వ్యవహారంలో అయినా సరే ఏకాభిప్రాయాన్ని అనేక తెగల కౌన్సిళ్ళ సమావేశంలో సామూహి కంగా తీసుకుంటాంరు. ప్రతి నాగా తెగకు స్వంత కౌన్సిల్ ఉంటుంది. అనేక తెగలకు ప్రాతి నిధ్యం వహించే సంస్థలు కూడా ఉన్నాయి. నాగా తెగలన్నింటికీ నాగా హోహో అత్యున్నత వేదిక. కాని ఇటీవల నాగా హోహో ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాజ్యాంగం లోని 371 (ఎ) అధికరణ నాగాలాండ్‌కు ప్రత్యేక హోదానిస్తోంది. ఇప్పుడు కొత్త ఒప్పందంతో నాగా ప్రజలకు మరిన్ని హక్కులు కల్పిస్తారు. అంతే కాదు, కొత్త ఒప్పందం ప్రకారం నాగా రాష్ట్ర అసెంబ్లీ స్థానంలో నాగా పార్లమెంటుకు కూడా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.

అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లోని నాగా ప్రాంతాల వ్యవహారాలు కూడా ఈ చట్టసభ పరిధిలోకి తీసుకువ స్తారనే మాటలు వినిపి స్తున్నాయి. నాగా ప్రజలకు భారత పాస్ పోర్టు ఇచ్చినా ప్రత్యేక నాగా చిహ్నంతో ఇస్తారు. కాని ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం లేకుం డా ఒప్పందానికి సిద్ధమయ్యేది లేదని ఈ గ్రూపుల్లో అతి పెద్ద గ్రూపు నిరాకరిస్తుంది. మరోవైపు జమ్ముకశ్మీర్ పరిణామాలు మరిన్ని అను మానాలకు కారణమయ్యా యి. నాగాలాండ్ కు ఇచ్చిన స్వయం ప్రతిపత్తి 371 (ఎ) అధికరణ కూడా హఠాత్తుగా రద్దు చేయరనే నమ్మకమేముందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రత్యేక రాజ్యాంగం కావలనే డిమాండ్ బలపడుతోంది.

In Naga peace talks lie fate of rebels own deal