Home జిల్లాలు నల్లమలలో అలజడి

నల్లమలలో అలజడి

వరంగల్ ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తం
చెంచుపెంటల్లో గుబులు

12121నాగర్‌కర్నూల్: చాలా కాలంగా నిశబ్దంగా ఉన్న జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ బూట్ల చప్పుళ్లు మొదల య్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మావోయిస్టు లకు సంబంధించి సమాచార వ్యవస్థ దెబ్బతీయడంతో పా టు గుర్తింపు ఉన్న నేతలన ఎన్‌కౌంటర్ చేస్తూ ఉద్యమంపై ఉక్కుపాదం మోపడంతో ఈ ప్రాంతంలో మావోల కదలిక లు దాదాపు కనుమరుగయ్యాయి. ఈ విషయాన్ని పోలీసు లు సైతం పదేపదే చెపుతూ వచ్చారు. కొత్తరాష్ట్రం కొత్త ప్ర భుత్వం పట్ల మావోలు వారిపట్ల ప్రభుత్వం కూడా చాలా కాలంగా మౌనంగా ఉండిపోయింది. కొద్దికాలంగా ప్రభు త్వంపై మావో నేతల ప్రకటనలు కొంత కలవర పరిచాయి. అయితే ఇవేవీ నల్లమల ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూ పలేదు. వరంగల్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఇద్దరు న క్సల్స్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా మరికొందరు తప్పిం కున్నారని పోలీసులు ప్రకటించడం కలకలం రేపుతున్నా యి. గతంలో పీపుల్స్‌వార్ తర్వాత రూపాంతరం చెందిన మావోలకు నల్లమల పుట్టినిల్లుగా ఉండేది. పార్టీ పెద్దపెద్ద నాయకులు సైతం ఈ ప్రాంతంలో తలదాచుకోవడం తె ల్సిందే.జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని అనుసరిస్తూ న్న కృష్ణానది నల్లగొండ, గుంటూరు ,ప్రకాశం,కర్నూల్ జి ల్లాల సరిహద్దులు మావోల రాకపోకలకు సురక్షిత స్థావరా లకు అనుకూలంగా ఉండేవి. చాలా కాలంగా ఇక్కడ మా వోల కదలిక ఆనవాలు లేక పోవడంతో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తర్వాత జిల్లా సరిహద్దులో నలమల అ టవీ ప్రాంతంలోకి మావోలు ప్రవేశించారన్న వార్తలు ఇక్కడి గిరిజనుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. గతంలో నక్స ల్స్ ,పోలీసుల బూట్ల చప్పుళ్లు,తుపాకుల మోత, రాత్రి పగ లు నక్సల్స్,పోలీసులు వేధింపులు గుర్తుకు తెచ్చుకుంటూ భయాందోళనకు గురవుతున్నారు.

కాగా గడిచిన వారం రో జులకు పైగా ప్రత్యేక పోలీసు బలగాలు నల్లమల అటవీ ప్రాతంలోని గుంటూరు, ప్రకాషం జిల్లాల సరిహద్దుల్లో కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని అడవుల్లో కూబింగ్ జరుపుతున్నట్లు తెల్సింది. ఇది సాధారణంగా చేసేదేనని పోలీసు వర్గాలు అంటున్నప్పటికి తేడా స్పస్టంగా కన్పింస్తున్నదని నల్లమల వాసులంటున్నారు. కాగా గతంలో మావోలకు నిలయంగా ఉండిన నల్లమలలో నాటిపరిస్థితులు లేవన్న వాదన కూడా లేక పోలేదు. గతంలో అక్కడి గిరిజనులు ముఖ్యంగా చెంచుల సహకారం వల్లే మావోలు మనుగడ సాగించ గలిగారని, దీంతోపాటు పోలీసులకు నల్లమల అటవీలోని లోతట్టు ప్రాంతంలోని దారులు,నీటిజాడలు పెద్దగాతెలియక పోవడంతో మావో షల్టర్లకు ,మనుగడకు దోకా లేకుండా ఉండేది.ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు పోలీసులు నల్లమలలోని అణువణువు జల్లెడ పట్టగల పరిచయం ,ఇన్‌ఫార్మర్ వ్యవస్థ పటిష్ట పర్చుకున్నారని అంటున్నారు. గతంలో లాగా మావోల మనుగడ అంత సులభం కాదన్న వాదనసైతం లేకపోలేదు. అయినప్పటికి నివురుగప్పిన నిప్పులా ఉండే మావోలు ,వారి సానుబూతి పరులు ఏదైనా చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందన్న అనుమానంతో పోలీసులు తమ నిఘా ,కూబింగ్‌లను విస్తృత పరుస్తున్నట్లు తెలిసింది.