Home తాజా వార్తలు ప్రజావాణిలో ఫించన్లు, ఇండ్ల కోసం భారీగా దరఖాస్తులు

ప్రజావాణిలో ఫించన్లు, ఇండ్ల కోసం భారీగా దరఖాస్తులు

Prajavani Program

 

హైదరాబాద్ : జిల్లా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఉపాధి, రుణాలు, ఇండ్లు, ఫించను అంశాలపై పిర్యాదులను ఆర్డిఓలు శ్రీనివాస్‌రెడ్డి, రాజాగౌడ్ స్వీకరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ అంశాలపై 230వరకు ఫిర్యాదులు అందజేయగా, వాటిలో కొన్నింటికి పరిష్కారాలు చూపడంతో 85 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పిటిషనులను సంబంధిత తహసీల్దార్లు, శాఖాధికారుల వెంటనే పరిష్కారించాలని ఆదేశించారు. గోల్కొండ మండలంలోని లంగర్‌ హౌజ్‌లో న్యూ హోరిజోన్ హైస్కూల్ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఉందని, అక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా చూడాలని వినతిపత్రం అందజేశారు.

హిమాయత్‌నగర్ మండల దోమలగూడలో జి.చక్రపాణి తాను వికలాంగుడని కుటుంబపోషణ భారంగా ఉందని ఫించను మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. అదే జి. రమ అనే మహిళ తనకూతురు పెళ్లి కోసం కళ్యాణలక్ష్మి పథకాన్ని దరఖాస్తు చేసుకున్నానని, దాంట్లో కొన్ని తప్పలు ఉండటంతో తిరిగి దరఖాస్తు సమర్పించిన ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదని, మంజూరు చేయాలని అభ్యర్దన చేశారు. సోమాజిగూడకు చెందిన ఎస్. కృష్ణ తన కొడుకు మూర్చ రోగి ఇంటర్ చదువుకుని లోయర్‌టైపులో పాసయ్యారని, వికలాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత తహసీల్దారు తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని సూచించారు. ఈకార్యక్రమంలో సిపిఓ రామభద్రం, విద్యాధికారి వెంకటనర్సమ్మ, బిసి వెల్పేర్ అధికారి విమలదేవి, డిడి ఎస్సీ కార్పొరేషన్ మాన్యానాయక్ తహాసీల్దార్లు పాల్గొన్నారు.

In Prajavani more applications for Pension, House Scheme