గవర్నర్‌తో కాంగ్రెస్ నేతల వాగ్వాదం
మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ ఇఎస్‌ఎల్ నర సింహన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇసుక మాఫియా ఆగడా లు, కామారెడ్డిలో జిల్లాలో సాయిలు మృతి తదితర అం శాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు టిపిసిసి అధ్యక్షు డు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభలో ప్రతిపక్ష నాయ కులు కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నాయకులు మ హ్మద్‌అలీ షబ్బీర్‌లు శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్ళారు. వారితో పాటు కాంగ్రెస్ నేతలు డి.కె.అరుణ, సర్వే సత్య నారాయణ, అంజన్‌కుమార్‌యాదవ్, దానం నాగేందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంపత్‌కుమార్, శ్రవణ్ తదిత రులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు తెలియజేసిన వివరాల ప్రకారం తొలుత గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి కొత్త సంవత్సరంలో ప్రభుత్వా నికి సహకరించాలని కోరారు. తరువాత కాంగ్రెస్ నాయ కులు ఇసుక మాఫియా ఆగడాలు, పిట్లంలో సాయిలు మృతి గురించి వివరిస్తుండగా, తప్పుడు సమాచారం ఇస్తు న్నారని గవర్నర్ అన్నట్లు తెలిసింది.
చనిపోయిన వ్యక్తి వి ఆర్‌ఎ కాదని, ఇసుక విషయంలో సిఎంను, మంత్రిని ఇష్ట మొచ్చినట్లు ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. అయి నా రాజకీయ నాయకులకు అక్కడేమి పని, గతంలో ఇసు క మాఫియా లేదా? అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనిపై ఉత్తమ్, సర్వే సత్యనారాయణలు తీవ్రంగానే స్పం దించారు. గవర్నర్ మాకు డిక్టేట్ చేయాల్సిన అవసరం లేదని ఉత్తమ్ అన్నారు. ‘మీరు మాకు చెప్పాల్సిన అవస రం లేదు, మేం పిల్లలం అనుకుంటున్నారా? మీరు హెడ్ మాస్టరా? మీరు గవర్నర్.. ఆ హోదాకు తగ్గట్లు మాట్లాడా లే తప్ప సిఎం, ఆయన కుమారుడిని వెనుకేసుకొస్తారా? అని సర్వే సత్యనారాయణ ఘాటుగా అన్నారు. దీంతో ఆ గ్రహం వ్యక్తం చేసిన గవర్నర్ లేచి వెళ్లేందుకు ఉద్యుక్తు డవగా, మళ్లీ సర్వే మాట్లాడుతూ మందకృష్ణను అరెస్టు చే స్తే ఏం చేశారు, ఆయన ఇంట్లో దీక్ష చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఉత్తమ్ కల్పించుకొని గాంధేయవాద ప ద్ధతిలో ఇంట్లో దీక్ష చేసిన వ్యక్తిని అరెస్టు చేయడమేమిట న్నారు. దీనికి గవర్నర్ స్పందిస్తూ శాంతి భద్రతల సమస్య వస్తుందనే నివేదికల కారణంగానే అరెస్టు చేసి ఉంటారని, తాను ఈ విషయంపై నివేదిక తెప్పించుకుంటున్నట్లు తెలి సింది. మళ్లీ సర్వే మాట్లాడుతూ ‘సోనియాగాంధీ, మన్మో హన్ వల్లే మీరు ఈ కుర్చీలో కూర్చున్నారు. అది మర్చిపో వద్దు. అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతావా? నీదగ్గ రకు రావడమే వృథా’ అని అన్నారు. ఆయనను ఎందుకు అదుపు చేయడం లేదని గవర్నర్ తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నేతలను అన్నట్లు తెలిసింది. ఒక దశలో సర్వేను ఉద్దేశిం చి ఫెలో అని అనగా, మల్లు రవి ఆక్షేపణ వ్యక్తం చేశారు. తామంతా చదువకున్నవాళ్ళమని ఫెలో అనడమేమిటని అంటుండగా ఇతర నాయకులు ఆయనను సముదాయిం చారు. చివరకు అటు గవర్నర్, ఇటు కాంగ్రెస్ నాయకు లు కోపంతో దర్బార్ హాల్ నుంచి నిష్క్రమించారు.
ఇసుక అక్రమాలపై విచారణ జరపాలి : ఉత్తమ్
గవర్నర్ దృష్టికి సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫి యా ఆగడాల విషయం, ఎంఆర్‌పిఎస్ నాయకులు మం దకృష్ణ దీక్షకు అనుమతివ్వకపోవడం, అరెస్టు చేయడం వంటి విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అనంతరం మీడియాకు తెలిపారు. సిరిసిల్లలో దళితుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగితే ఎస్‌పి మీద ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించామన్నా రు. రాష్ట్రంలో ఇసుక మాఫీయా నడుస్తోందని, ఇది రాష్ట్రా నికి, పర్యావరణానికి తీరని నష్టమన్నారు. పిట్లంలో సా యిలు ఇసుక ట్రాక్టర్ వల్లే చనిపోయాడని, ఆ గ్రామానికి ఎవరినీ ఎందుకు రానీయడం లేదని గవర్నర్ దృష్టికి తీసు కెళ్ళినట్లు చెప్పారు. అంతర్జాతీయ విషయాలపై ట్విట్టర్ లో స్పందించే కెటిఆర్ సొంత శాఖలో జరుగుతోన్న ఘో రాలపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఇసుక విష యంలో ఎందుకు నిబంధనలు పాటించడం లేదని, కింది స్థాయి అధికారులను బెదిరిస్తున్నారన్నారు. గాంధేయమా ర్గంలో మందకృష్ణ దీక్ష చేస్తే అరెస్టు చేయడమేమిటని ప్ర శ్నించారు. పిట్లంలో సాయిలు మృతికి కారణమైన ఇసుక కాంట్రాక్టర్‌పై హత్యా కేసు నమోదు చేయాలని, సాయిలు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేరెళ్ల ఇసుక బాధితులకు న్యాయం చేయాలని, ఇసుక అక్రమాలపై ఎసిబితో విచారణ జరపా లన్నారు. ఇసుక విధానంపై నిపుణులు, అఖిలపక్ష నేతల తో సమీక్షించాలని కోరారు.