Wednesday, March 22, 2023

సిద్దిపేటలో… మంత్రి హరీశ్‌రావు పర్యటన

- Advertisement -

harish*ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న మంత్రి
*రైతు బజార్ ఆకస్మిక తనఖీ
*రంగనాయకసాగర్ ప్రాజక్టు పరిశీలన

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్‌రావు గురువారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భ ంగా పలు కార్యక్రమాలకు హాజరైనారు. బుధవారం ఉదయం భారత్‌నగర్‌లో అనారోగ్యంతో మృతి చెందిన జానపద కళాకారుడు ఎస్. ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కౌన్సిలర్ ఐలయ్య యాదవ్ తండ్రి మృతి చెందడంతో ఆయనను పరామర్శించారు. టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు జిల్లా శ్రీనివాస్ తల్లి ఇటీవలె మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని, హౌ సింగ్ బోర్డులోని కృష్ణమనేని రామారావు తండ్రి మృతి చెందడంతో ఆ యన కుటుంబాన్ని, ఇమాంబాద్ ఉప సర్పంచ్ తండ్రి మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ప రామర్శించారు. ప్రముఖ న్యా యవాది ఉప్పర మల్లేశంకు ఇటీవలె గుండు ఆపరేషన్ జరగడంతో హౌసింగ్ బోర్డులో ఆయనను కలసి ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
రైతు బజార్ ఆకస్మిక తనఖీ
సిద్దిపేట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న రైతు బజార్ ప నులను మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా తనఖీ చేశారు. అక్కడి పనులను పరిశీలించడమే కాకుండా రైతులకు వెసులుబాటు కలిగి వుండేలా అరల ఏర్పాటు విషయాన్ని అదికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సిద్దిపేట రైతు బజార్‌ను తీర్చిదిద్దుతున్నామని భయట స్క్రీన్‌ను ఏర్పాటు చేయాలని సూచించి అక్కడి పరిసరాల్ని పరిశీలించారు. ప్రారంభోత్సవం నాటికి రైతు బజార్ పనులు అన్ని పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ ఈఈ మహేందర్ పాల్గొన్నారు.
ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న మంత్రి : సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద గల దర్గాలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా దర్గాలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు కోసం నిర్వాహకులు వినతిపత్రం అందజేశారు.
రంగనాయక సాగర్ ప్రాజక్టు పరిశీలన : చంద్లాపూర్ గ్రామం వద్ద నిర్మిస్తున్న రంగనాయక సాగర్ రిజర్వాయర్ పనులను మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ నిర్మిస్తున్న ఎస్‌ఈ కార్యాలయ పనులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రా జక్టు పంప్ హౌస్ పనులను పరిశీలించి టన్నెల్లోకి వెల్లి పనులు చూశారు. దాదాపు గంటపాటు ఈ ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి పలు సలహాలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరామిరెడ్డి, ఇరిగేషన్ ఈఎన్‌సీ మురళీధర్, సీఈ హరిరాం, ఎస్‌ఈ వేణు, ఈఈ ఆనంద్‌తో పాటు అదికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పిట్టలోళ్లకు మంత్రి భరోసా : రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద నివాసం వుంటున్న పిట్టలోళ్లు మంత్రి హరీష్‌రావును కలిసారు. చంద్లాపూర్ వద్దగల పళ్లగుట్ట వద్ద వారు నివాసం వుంటున్న విషయాన్ని తెలుసుకుని వారందరికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామి ఇచ్చారు. దీంతో వారందరూ సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News