Saturday, April 20, 2024

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో…

- Advertisement -
- Advertisement -

Local boy

 

ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘పటాస్’. ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ధనుష్ ద్విప్రాతాభినయం చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘లోకల్ బాయ్’ పేరుతో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.హెచ్. సతీష్‌కుమార్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మెహరీన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని జగన్మోహిని సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్. సతీష్ కుమార్ మాట్లాడుతూ “మార్షల్ ఆర్ట్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం ధనుష్ మార్షల్ ఆర్ట్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రాచీన యుద్ధ విద్య అడిమురై గొప్పదనాన్ని వివరించే చిత్రమిది”అని అన్నారు.

In the background of martial arts Local boy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News