Tuesday, March 21, 2023

అక్రమవెంచర్ల కూల్చివేతల్లో..తగ్గిన జోరు!

- Advertisement -

cons*అర్థాంతరంగా చర్యలు నిలిపివేతపై అనుమానాలు

*అధికారికంగా ఉన్నవి ఆరు.. కూల్చింది మాత్రం ఒక్కటే

*ద్విపాత్రాభినయం చేస్తున్న అధికార యంత్రాంగం

*అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు

*ఐనా పట్టించుకోని వైనం

మన తెలంగాణ/అమీన్‌పూర్/రామచంద్రాపురం : అక్రమ వెం చర్లపై ఉక్కుపాదం మోపుతాం… ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్ని వదలకుండా కూల్చుతాం… హెచ్‌ఎండిఏ అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే కఠిన చర్యలు.. కేవలం అమీన్‌పూర్ ఒక్కటే కాదు ప్రతి గ్రామంలోను ఇదే తరహా చర్యలు చేపడమని అదరగొట్టే డైలాగులతో మీడియా ముఖంగా ప్రకటించిన పంచాయతీ అధికారులు ఒక్కరోజులోనే తోకముడిచారు. అమీన్‌పూర్ పుట్టగొడుగుల్లో వెలుస్తున్న అనేక అక్ర మ వెంచర్లలో వేల సంఖ్యల్లో నిర్మాణాలు కొనసాగిస్తున్న తీరుపై జిల్లా అధికార యంత్రాంగం స్థానిక అధికారుల తీ రుపై కన్నెర్ర చేసింది. దీంతో గత పక్షం రోజుల క్రితం పెద్ద ఎత్తున పంచాయతీ సిబ్బందితో పోలీసు ల భద్రత నడుమ కూల్చివేతలు చేపట్టారు. అం దులో భాగంగా అ మీన్‌పూర్ నరేంద్రకాలనీ పక్కన నూ తనంగా ఏర్పడిన సెత న్ వెంచర్‌లో దాదాపు 30 ఇళ్లను నేలమట్టం చేశారు. అనంతరం అదేరోజు మరిన్ని అ క్రమ వెంచర్లకు సైతం చర్యలు తీసుకుంటామని స్వయానా ఈఓపిఆర్‌డి దేవాదాస్, అమీన్‌పూర్ ఈఓ శ్రీనివాస్ మీడి యా ముఖంగా అక్రమ వెంచర్ల పేరు, సర్వే నంబర్లతో సహా ప్రకటించారు. కొనసాగతున్న ఇంతవరకు బాగానే ఉన్నా అస్సలు విషయం ఇక్కడి నుండే మొదలైంది. నిర్మాణ దారుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రాత్రికి రాత్రే పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయన్న విమర్శలు ఉన్నాయి. నిర్మాణదారుల నుండి అందినకాడికి దండుకున్న అధికారులు ఇటు అక్రమ నిర్మాణాలకు వంతపాడుతూనే.. ఇటు ఉన్నతాధికారుల వద్ద విజతను ప్రదర్శిస్తూ నామ మాత్రపు చర్య లు చేస్తున్నారు.
పాతతేదీలతో కొత్త వెంచర్లు
కనీస ప్రమాణాలు పా టించకుండా పాత తేదీల్లో వందలకొద్ది ఎకరాల్లో వేల సంఖ్యల్లో ఎలాంటి అనుమతులు లేకు ండా నిర్మాణాలు చేపడుతున్న సంబంధిత అధికారులు కిమ్మనకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఏదైన ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులపుకుంటున్నారే తప్ప అక్రమాలను పూర్తిస్థాయిలో అడ్డుకునే ప్రయత్నాలు చేయకపోవం శోచనీయం. అంతేకాకుండా ప్రస్తుత నిభందనల ప్రకాకం కొత్త వెంచర్లకు పంచాయతి నుం డి అనుమతులు ఇవ్వడానికి అర్హతలేనప్పటికి పాత తేదీలతో పంచాయతి లేఔట్‌లు వెలుస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఒక లేఔట్‌కు సంతకం చేశారన్న ఆరోపణలతో ఒక మాజీ సర్పంచ్‌పై కేసు నమోదైన సంఘటనలు సైతం ఉన్నాయి. కేవలం లేఔట్ పత్రం తప్ప పంచాయతి అధికారు ల్లో ఎక్కడ కూడ సదరు వెంచర్లకు సంబందించి ఎక్కడ కూడ రికార్డుల్లో ఉండదు. మరికొందరు కనీసం నాలా కన్వెర్షన్ కూడ చెల్లిచకుండా వెం చర్ల పేరుతో అమాయక ప్రజలకు ప్లాట్లు విక్రయిస్తు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత తంతు జరుగుతున్న అడ్డుకోవాల్సిన కం చే చేనుమేసే అన్న తీరుతో తమ జేబులు నింపుకుంటున్నారే తప్ప తమ వృత్తి ధర్మం మరుస్తున్నారు.
జిల్లా యంత్రాంగం స్పందించేనా : బంగారు తెలంగాణ సాధనలో కఠిన నిర్ణయాలకు వెనకాడబొమని ప్రభుత్వ పెద్దలు పలు మార్లు హెచ్చరించిన ప్రభుత్వంల్లో మాత్రం ఆ జపం పనిచేసిన దాఖాలు తక్కువే అని చెప్పుకోవచ్చు. అక్రమ నిర్మాణాలపై అమీన్‌పూర్‌లో చేపట్టిన చర్యలు ఆదిలోనే ఆపేస్తారా.. లేకా కొనాగించి తమ చిత్తశుద్దిని కనబరుస్తారా అనేది జిల్లా పంచాయతీ అధికారులపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే పంచాయతీ అధికారుల తీరుపై ప్రజల్లో అనేక రకాల అనుమానాలు ఉ న్నాయి. ముఖ్యంగా అమీన్‌పూర్ మండల పరిధిలో చోటు చేసుకుంటు న్న పరిణామాలు చెప్పక్కరలేదు. నిభందనకు విరుద్ధంగా కొనసాగుతు న్న వెంచర్లపై గత రెండేళ్ల క్రితం హెచ్‌ఎండిఏ అధికారులు దాడులు చేసినప్పటికి అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగలేదు. నిర్మాణ మొదలు దశలో నే అడ్డుకోకపోవడంతో అస్సలు తిమింగలలు తప్పించుకుని అనామకు లు బలవుతున్నారన్న వాదనలు ఉన్నాయి. ఎట్టకేలకు చర్యలు చేపట్టిన అమీన్‌పూర్‌లో దాదాపు ఆరు వెంచర్లు, నిర్మాణదారుల పేరుతోసహా ప్రకటించిన అధికారులు సదరు వెంచర్లపై చర్యలు తీసుకుంటారో లేదా..ఈ అంశంపై జిల్లా యంత్రాంగా స్పందింస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles